అదేంటి ధృవ సినిమాలో అరవింద్ స్వామి కదా విలన్ అనే కదా మీ డౌట్.సినిమాలో ఆయనే విలన్ కాని బయట మాత్రం రామ్ చరణ్ విలన్.
అవును, బిజినెస్ పరంగా చరణ్ విలన్ ఈ సినిమాకి.రామ్ చరణ్ ఇమేజ్ ఈ సినిమా ఓపెనింగ్స్ తక్కువగా రావడానికి కారణం.
ధృవ మంచి సినిమా.రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి.
తమిళ్ లో భారి హిట్ గా నిలిచిన తని ఒరువన్ కి రీమేక్ ఇది.మరి ఇక్కడ ఓపెనింగ్స్ ఎందుకు బాగా లేవు అంటే, ఆ సినిమా చరణ్ చేయడం వలనే.
మామూలుగా చరణ్ సినిమా అంటే పంచ్ డైలాగులు, విలన్ ని చితకబాదడం, డ్యాన్సులు బాగా చేయడం, కామెడి ఉండటం … ఇలాంటి అంచనాలతో వెళతారు మాస్ ప్రేక్షకులు.కాని ధృవ అలాంటి సినిమా కాదు కదా.చాలావరకు విలన్ హీరోని డామినేట్ చేస్తాడు.అసలు హీరో విలన్ ని ఫిజికల్ గా ఒక్క దెబ్బ కొట్టాడు.
హీరో విలన్ కి మధ్య ఒక్క ఫైట్ సన్నివేశం ఉండదు.అంతా బ్రెయిన్ గేమ్.
మరి ఇలాంటి సినిమాలు మనవాళ్ళు చూడరా అంటే ఎందుకు చూడరు ? ఇదే సినిమా యూనివర్సల్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ చేసుంటే ఇంకా బాగా రిసీవ్ చేసుకునేవారేమో ప్రేక్షకులు.
ఆరంభం బాగా లేదు.
కాని ముగింపే ముఖ్యం.ప్రీమియర్స్ బాగా లేకున్నా, ఓవర్సీస్ లో ఊపందుకుంది ధృవ.మరి మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా రామ్ చరణ్ ఇమేజ్ మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు నుంచి ఆదరిస్తారో లేదో చూడాలి.