క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!

క్రిస్మస్ అంటేనే అద్భుతాలు, ఊహించని సంఘటనలు.అయోవాలోని ఓ యువతికి ఈ క్రిస్మస్ నిజంగానే మ్యాజిక్‌లా మారింది.

 Lottery Ticket In Christmas Stocking Became A Millionaire In One Night, Lottery-TeluguStop.com

తన క్రిస్మస్ స్టాకింగ్‌లో ఓ లాటరీ టికెట్ కనుగొన్న ఆమె, ఒక్కసారిగా కోటీశ్వరురాలైపోయింది.మొదట్లో సాధారణ టికెట్‌లా అనిపించినా, గీసిన వెంటనే ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది.ఏకంగా 150,000 డాలర్లు (సుమారు రూ.1.28 కోట్లు) గెలుచుకుంది.ఈ వార్త వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

ఆ అదృష్టవంతురాలి పేరు టేలర్ కాఫ్రే( Taylor Caffrey ), వయసు 25 సంవత్సరాలు, అమెరికాలోని గ్రిమ్స్‌లో( Grimes in America ) నివసిస్తుంది.టేలర్ తల్లి ప్రతి సంవత్సరం క్రిస్మస్‌కు కుటుంబ సభ్యులందరి స్టాకింగ్స్‌లో లాటరీ టికెట్లు పెట్టడం ఒక ఆనవాయితీ.

ఈసారి కూడా ఆమె టేలర్ స్టాకింగ్‌లో “మనీ గిఫ్ట్” ( Money Gift )స్క్రాచ్ టికెట్‌ను పెట్టింది.ఈ టికెట్‌ను వెస్ట్ డెస్ మోయిన్స్‌లోని హై-వీ ఫాస్ట్ & ఫ్రెష్‌లో కొనుగోలు చేశారు.

తల్లి పెట్టిన చిన్న లాటరీ టికెట్ టేలర్ జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు.

టేలర్ గెలుపును అయోవా లాటరీ సంస్థ ( Iowa Lottery Corporation )సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.“శాంటా డెలివర్ చేశాడు!” అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టడంతో ఈ వార్త వైరల్ అయింది.నిజానికి టేలర్‌కు శాంటా రూపంలో వచ్చింది తన తల్లే.

ఈ ఊహించని బహుమతికి టేలర్ ఆనందానికి అవధుల్లేవు.తన తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

విలేకరులతో మాట్లాడుతూ టేలర్ తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకుంది.గెలుచుకున్న డబ్బుతో మొదట తన కాలేజీ రుణాన్ని తీరుస్తానని చెప్పింది.ఆ తర్వాత మిగిలిన డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలు కంటోంది.ఈ లాటరీ గెలుపుతో తన కల నిజమయ్యే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.

చూశారుగా, చిన్న, ప్రేమపూర్వక బహుమతులు కూడా కొన్నిసార్లు పెద్ద అద్భుతాలకు దారితీయవచ్చు.టేలర్‌కు ఒక సాధారణ క్రిస్మస్ సంప్రదాయంగా మొదలైన ఈ సంఘటన, ఆమె జీవితాన్నే మార్చేసింది.

ఈమె స్టోరీ ఊహించని ఆనందాలు ఎప్పుడూ, ఎక్కడైనా మనల్ని వెతుక్కుంటూ రావచ్చనే ఆశలు రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube