ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) కు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు నుంచి కాస్త ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే.ఇటీవల ఈ కేసులో ఈయన బెయిల్(Bail ) పిటిషన్ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది అయితే ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఈ కేసు నుంచి చాలా ఉపశమనం లభించిందని చెప్పాలి.మరి అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పటికీ కొన్ని షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది.
మరి కోర్టు అల్లు అర్జున్ కు ఎలాంటి షరతులను విధించింది అనే విషయానికి వస్తే… ఈయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ 50వేల రూపాయల పూచి కత్తితో ఇద్దరు సాక్షులతో ఒక బాండ్ సమర్పించాలని వెల్లడించింది.అదేవిధంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.ఇక ఈ కేసు గురించి ఈయన ఎవరితో మాట్లాడకూడదని అలా మాట్లాడితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి కనుక మాట్లాడుకూడదంటూ కూడా షరతు విధించింది.
మరోవైపు బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టులో వాదించారు.అల్లు అర్జున్ తన పలుకుబడిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ పోలీసు తరపు న్యాయవాది కూడా వాదించారు.ఇలా ఇద్దరి వాదనలు విన్న అనంతరం కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఈ కేసులో క్వాష్ పిటీషన్ హైకోర్టు ఉంది.ఈ పిటీషన్ విచారణ కూడా ఈ నెల 21వ తేదీ జరుగుతుందని ఈ విచారణలో కూడా తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అంటూ అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ( Ashok Reddy )ఈ విషయాలన్నింటినీ కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు.