నిద్రలేమి.నేటి ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.ఫోన్లు, ల్యాప్‌టాప్లతో బిజీగా గడుపుతూ.నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.నిద్ర అనేది ఆరోగ్యానికి పునాది.ఎన్నో జబ్బులను నిద్రతోనే నియంత్రించుకోవచ్చు.
అలాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తే.నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
ఫలితంగా.బరువు పెరిగిపోవడం, గుండె జబ్బులు, శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి క్షీణించడం, స్కిన్ డ్యామేజ్, డయాబెటిస్ వచ్చే రిస్క్ పెరగడం ఇలా ఎన్నో సమస్యలు చుట్టు ముడతాయి.

అందుకే నిద్రలేమి సమస్యను నివారించుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.అయితే నిద్రలేమిని దూరం చేయడంలో జీలకర్ర అద్భుతంగా సహాయపడుతుంది.వంటల్లో విరి విరిగా ఉపయోగించే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి.కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఇలా ఎన్నో పోషకాలు జీలకర్రలో నిండి ఉంటాయి.
ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా నిద్ర లేమితో బాధ పడేవారికి జీలకర్ర అద్భుతంగా సహాయడుతుంది.
నిద్ర లేమి సమస్య ఉన్న వారు ఒక స్పూన్ జీలకర్రను తీసుకుని.మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
అనంతరం బాగా పండిన అరటి పండులో ముందుకు సిద్ధం చేసుకుని జీలకర్ర పొడి మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

ఒక స్పూన్ జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి.గోరు వెచ్చగా అయ్యాక ఆ నీటిలో కొద్దిగా బెల్లం కలిపి సేవించాలి.ఇలా చేసినా నిద్ర లేమి సమస్య దూరం అవుతుంది.అలాగే ఈ జీరా డ్రింక్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మన్లన్నీ బ్యాలన్స్ అవుతాయి.మరియు ఈ డ్రింక్‌తో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది.