తాజాగా జరిగిన గేమ్ ఛేంజర్( Game Changer ) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.ఒకవైపు పవన్ ఫ్యాన్స్, మరోవైపు చెర్రీ ఫ్యాన్స్ తో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సైతం హాజరైన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్( Actor Srikanth ) ఒక కీలక పాత్ర పోషించారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్.
నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్.
ఎస్ జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నాను.అంజలి గారు, సముద్రఖని గారు ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయి.తమన్ గారు మంచి సంగీతాన్ని అందించారు.
సినిమా సినిమాకు రామ్ చరణ్ తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నారు.ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటాడు.
అప్పటికీ ఎప్పటికీ రామ్ చరణ్ బిహేవియర్ లో ఏమీ మారలేదు.సుకుమార్ గారు చెప్పినట్టు ఈ సినిమాకు జాతీయ అవార్డు( National Award ) రావాలి.
ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా ఈవెంట్ లో భాగంగా శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా గేమ్ చేంజర్ విషయానికి వస్తే.
శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
అందులో భాగంగా రాజమండ్రిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.విడుదల తేదీకి మరొక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.