ఈ కషాయం జలుబు, దగ్గును రెండు రోజుల్లో తరిమికొడుతుంది.. తెలుసా?

ప్రస్తుత చలికాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు, దగ్గు ముందు వరుసలో ఉంటాయి.ఈ సీజనల్ వ్యాధులు దాదాపు అందర్నీ ముప్పతిప్పలు పెడుతుంటాయి.

 This Kashayam Will Drive Away Cold And Cough In Two Days Details! Kashayam, Cold-TeluguStop.com

జలుబు, దగ్గు ఒక్కసారి పట్టుకున్నాయంటే అంత సులభంగా వదిలిపెట్టవు.పైగా ఇంట్లో ఒకరికి వచ్చాయంటే మిగిలిన వారందరికీ ఈజీగా అంటుకుంటాయి.

ఇక జలుబు, దగ్గును వదిలించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే కషాయాన్ని తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే జలుబు, దగ్గు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్‌ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, ఐదు మిరియాలు, మూడు యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అర అంగుళం ఎండిన అల్లం ముక్క, ఐదు లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్ట‌వ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ వేసి మరిగించాలి.నీరు సగం అయ్యేంత వరకు వాటర్ ను బాయిల్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన నీటిని స్ట్రైనర్‌ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే మన కషాయం సిద్ధమవుతుంది.ఈ కషాయాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

రోజుకు రెండు సార్లు అంటే ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని తాగితే జలుబు, దగ్గు రెండు రోజుల్లోనే దగ్గు ముఖం పడతాయి.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.జ్వరాన్ని సైతం ఈ కషాయం తరిమికొడుతుంది.అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది.కాబ‌ట్టి, జ‌లుబు ద‌గ్గు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ కషాయాన్ని తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube