త్రివిక్రమ్ వివాదం... నటుడు శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్?

సినీ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) గత కొద్దిరోజులుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే .కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే నా సినీ జీవితం నాశనమైంది అంటూ ఈమె ఎన్నో సందర్భాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి విమర్శలు వర్షం కురిపించారు.

 Director Trivikram Issue Poonam Kaur Counter To Shiva Balaji , Shiva Balaji, Poo-TeluguStop.com

ఇలా ఆయన నాకు చేసిన అన్యాయం పట్ల నేను మా అసోసియేషన్ లో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Trivikrampoonam, Maa, Poonam Kaur, Shiva Balaji-Movie

ఈ విధంగా మా అసోసియేషన్ చర్యలు తీసుకోలేదంటూ ఈమె మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలపై మా అసోసియేషన్‌ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ ( Siva Balaji ) రియాక్ట్‌ అయ్యారు.ఆమె నుంచి మాకు ఏ విధమైనటువంటి రాతపూర్వక ఫిర్యాదులు రాలేదని తెలిపారు.అలాగే గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్టు రికార్డ్స్ లో కూడా ఎక్కడా లేదు అంటూ  శివ బాలాజీ పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై కామెంట్లు చేశారు.ఈ విధంగా ఫిర్యాదు చేయడం లేదంటూ శివ బాలాజీ చెప్పడంతో మా అసోసియేషన్ నుంచి పూనమ్ కౌర్ కి వెళ్లినటువంటి మెసేజ్ ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నటుడు శివ బాలాజీకి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

Telugu Trivikrampoonam, Maa, Poonam Kaur, Shiva Balaji-Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది.మీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ సమయానికి మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ మా అసోసియేషన్ నుంచి తనకు మెయిల్ పంపించినట్టు ఈ పోస్ట్ లో ఉంది.ఇక పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తనపై ఎవరు చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతుంది.మరి ఇప్పటికైనా ఈ విషయంపై మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube