మన శరీరానికి నువ్వులు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి.ఎందుకంటే నువ్వులలో మన శరీరానికి అవసరమైన ఖనిజాల లవనాలు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, రాగి, పొటాషియం లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.
అయితే మన రోజువారి ఆహారంలో నువ్వులను తీసుకోవాలంటే కొంతమందికి కుదరదు.అందుకే నువ్వులతో చేసిన రుచికరమైన లడ్డులను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనం సంపూర్ణ పోషకాలను పొందవచ్చు.
దీంతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
అయితే కొంతమందికి నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో తెలిసి ఉండదు.
అయితే అలాగే నువ్వుల లడ్డులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా తెలిసి ఉండదు.అయితే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ముందుగా నాణ్యమైన నువ్వులను సేకరించి వాటిని దోరగా వేయించి తర్వాత బెల్లం చిక్కని పాకంలో మార్చుకొని అందులో దోరగా వేయించుకున్న నువ్వులను కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే రుచికరమైన నువ్వు లడ్డులు రెడీ అయిపోతాయి.
ఇక దీంట్లో మరింత రుచి కోసం ఎండు ద్రాక్ష, బాదంపప్పు కూడా వేసుకోవచ్చు.ఇలా తయారు చేసుకున్న లడ్డులను ఒక గాజు జార్ లో నిలువ చేసుకొని ప్రతిరోజు ఒకటి లేదా రెండు చొప్పున ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వస్తాయి లభిస్తాయి.ప్రతిరోజు ఇలా బెల్లంతో చేసిన నువ్వుల లడ్డులను ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే రక్తంలో హిమగ్లోబిన్ ఉత్పత్తి ఎక్కువగా ఈ రక్తహీనత సమస్య తొలగిపోతుంది.దీంతో రోజంతా మనం చురుగ్గా ఉండవచ్చు.నువ్వులు అలాగే బెల్లం లో సమృద్ధిగా లభించే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు దంతాలకు దృఢత్వాన్ని ఇస్తుంది.అలాగే ఆర్థరైటిస్ ఆస్తియోఫోర్స్సిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
అలాగే వృద్యాప ఛాయాలను తగ్గిస్తాయి.అలాగే నువ్వుల పుష్కలంగా లభించు విటమిన్ ఏ, విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.