వేలం పాటలో సినిమాలో వాడిన వస్తువులు ఎంతకు అమ్ముడు పోయాయో తెలుసా ?

సినిమా అన్నాక చాలా ఆయుధాలు లేదా వస్తువులు బట్టలు ఇలా చాలా ఉంటాయి.అందులో కొన్నిటికి ఊహించని విధంగా చాలా క్రేజ్ వస్తూ ఉంటుంది.

 Movie Property For Auction , Tollywood, Movie Property, Simha Movie, Maryada Ram-TeluguStop.com

దాన్ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు, దర్శకులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.టాలీవుడ్( Tollywoo )లో అనేక సినిమాల్లో వాడిన వస్తువులు లేదా కత్తులు చాలా పాపులర్ అయ్యాయి.

దాంతో సదరు సినిమాల దర్శకులు వాటిని వేలంపాట వేసి మరి డబ్బు రూపంలో మార్చుకునే ప్రయత్నం చేశారు.అలా కొందరు స్టార్స్ వాడిన వస్తువులు వేలం పాటలు మంచి ధర పలికాయి మరి వాటి వివరాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Bike, Cycle, Maryada Ramanna, Gopichand, Simha, Tollywood-Telugu Stop Exc

సింహా సినిమా( Simha movie ) అనగానే ప్రతి ఒక్కరికి బాలకృష్ణ చేతిలో ఉన్న కత్తి మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది.ఆ కత్తిని ఒకసారి వేలానికి పెట్టారట ఆ చిత్ర నిర్మాత.దానికి చాలామంది అభిమానులు డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చారు.అలా ఆ బాలకృష్ణ అభిమాని ఒకరు ఏకంగా 15 లక్షల రూపాయలు పెట్టి సదరు కత్తిని సొంతం చేసుకున్నారు.

ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న( maryada ramanna ) సినిమాలో హీరో సునీల్ తొక్కిన సైకిల్( cycle ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇది సినిమాలో రవితేజ వాయిస్ తో చాలా బాగా జనాలను అట్రాక్ట్ చేసింది.

Telugu Bike, Cycle, Maryada Ramanna, Gopichand, Simha, Tollywood-Telugu Stop Exc

దాంతో ఈ సైకిల్ ని రాజమౌళి వేళానికి పెట్టగా దీనినీ దక్కించుకోవడానికి చాలామంది సెలబ్రిటీస్ పాల్గొన్నారు.అలా ఒక నిర్మాత గోపిచంద్( Producer Gopichand ) అచ్చట దానిని లక్ష యాభై వేల రుయపాలకు కొనుగోలు చేశారు.ఇక ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాలోని హీరో వాడిన బైక్ కూడా ఒకసారి వేలం పాట పెట్టారు దానిని ఈ కరోనా బాధితులకు ఇవ్వాలని అనుకున్నారు దాంతో రెండు లక్షలకు ఒక అభిమాని కొనుగోలు చేయగా ఆ బైక్ ని అమ్మడం ఇష్టం లేని హీరో కార్తికేయ 2,50,000 అభిమానికి ఇచ్చి ఆ బైక్ ని మళ్ళీ తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube