అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా పని చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) మాదవీలత( Madhavi Latha ) గురించి తాను అలా మాట్లాడటం తప్పేనని చెప్పుకొచ్చారు.మాధవీలతకు తాను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.
తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని క్షమాపణలు కోరుతున్నానని ఆయన వెల్లడించారు.
తాను ఆవేశంలో వ్యాఖ్యలు చేశానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఆలోచన తనకు లేదని జేసీ ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
కొంతమంది తాను పార్టీ మారిపోవాలని విమర్శలు చేస్తున్నారని అలా కామెంట్లు చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన వెల్లడించారు.డిసెంబర్ నెల 31వ తేదీన నన్ను నమ్మి 16,000 మంది అక్కాచెల్లెళ్లు జేసీ పార్క్ కు వచ్చారని జేసీ ప్రభాకర్ కామెంట్లు చేయడం గమనార్హం.
నా గురించి మాట్లాడిన రాజకీయ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లేనని ఆయన చెప్పుకొచ్చారు.తాడిపత్రి( Tadipatri ) కోసం ఎంత దూరమైనా వెళ్తానని రెండేళ్లలో తాడిపత్రి రూపురేఖలు మార్చేస్తానని జేసీ ప్రభాకర్ తెలిపారు.గత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రజలు నా వైపు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం అని ఆయన తెలిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో మాధవీలత రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.మాధవీలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఆమె కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
మాధవీలతకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల గురించి మాధవీలత వేగంగా రియాక్ట్ అవుతున్నారు.
రాబోయే రోజుల్లో ఆమె పొలిటికల్ గా మరింత సక్సెస్ సాధించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.మాధవీలత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఆమె ఆలోచనలు ఈ విధంగా లేవని తెలుస్తోంది.
మాధవీలత తప్పు చేసిన వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.