కారణాలు తెలియవు కానీ బాలయ్య,( Balayya ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మధ్య గ్యాప్ కొనసాగుతోందని అటు బాలయ్య ఫ్యాన్స్ కు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఉంది.బాలయ్య గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లు చేయలేదు.
బాలయ్య సైతం తారక్ గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకపోయినా అన్ స్టాపబుల్ షోలొ మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడానికి ఆసక్తి చూపించడం లేదు.
అయితే డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాకు తమ సపోర్ట్ ఉండబోదని సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్( Jr NTR Fans ) కామెంట్స్ చేస్తున్నారు.
తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే డాకు మహారాజ్ కలెక్షన్లపై కొంతమేర ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తాజాగా విడుదలైన డాకు మహారాజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.డాకు మహారాజ్ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో నటిస్తుండటం గమనార్హం.
డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.డాకు మహారాజ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.డాకు మహారాజ్ బాలయ్య గత సినిమాల కంటే పెద్ద హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.డాకు మహారాజ్ కు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
డాకు మహారాజ్ రిజల్ట్ విషయంలో నిర్మాత నాగవంశీ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.