ప్రస్తుత ఈ చలి కాలంలో చాలా మందిని వేధించే సమస్య `డ్రై లిప్స్`.వాతావరణంలో వచ్చే మార్పులు, చల్ల గాలులు కారణంగా పెదవులపై తేమ తగ్గి పోయి పొడిగా, నిర్జీవంగా మారిపోతుంటాయి.ఈ క్రమంలోనే ఒక్కోసారి పెదాలపై పగుళ్లు సైతం ఏర్పడుతుంటాయి.అందుకే చలి కాలంలో అందరూ ఖచ్చితంగా లిప్ బామ్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.లిమ్ బామ్ వాడితే.పెదాలు పొడి బారకుండా, పగలకుండా ఉంటాయి.
మరియు తేమగానూ ఉంటాయి.

కానీ, మార్కెట్‌లో లభ్యమయ్యే లిప్ బామ్స్‌లో రకరకాల కెమికల్స్ నిండి ఉంటాయి.వీటిని యూజ్ చేస్తే తాత్కాలికంగా మేలు జరిగినా.క్రమక్రమంగా రకరకాల సమస్యలు ఎదురవుతాయి.
అందుకే ఇంట్లో తయారు చేసుకున్న లిప్ బామ్స్‌నే వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే గ్రీన్ టీ తో లిప్ బామ్‌ను ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గ్రీన్ టీని తయారు చేసి పెట్టు కోవాలి.ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ బాదం నూనె, మూడు స్పూన్ల గ్రీన్ టీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి.ఆపై ఇందులో బీస్‌వ్యాక్స్ యాడ్ చేసుకుని మరో సారి హీట్ చేస్తే లిప్ బామ్ సిద్ధమైనట్టై.