ఇటీవల రోజుల్లో 40 ఏళ్లు వచ్చాయంటే చాలు ముఖంలో ముడతలు కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి.ముడతలు ముసలితనానికి సంకేతం.
వాటిని చూడగానే చాలా మంది తెగ హైరానా పడిపోతుంటారు.అప్పుడే ముసలితనం వచ్చేసిందా అని లోలోన తీవ్రంగా మదన పడుతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించాల్సిందే.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ మీ యవ్వనం చెక్కు చెదరదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించాలి.
పీల్ తొలగించిన బంగాళదుంపను సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప జ్యూస్ ( Potato juice )ను వేసుకోవాలి.అలాగే ఒక ఎగ్ వైట్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn flour ) వేసుకుని మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.ఒకవేళ ముడతలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

చర్మం టైట్ గా మారుతుంది.వృద్ధాప్య ఛాయలు( Aging shades ) త్వరగా దరిచేరకుండా ఉంటాయి.అరవైలోనూ యవ్వనంగా మెరిసిపోతారు.
కాబట్టి యవ్వనాన్ని కాపాడుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ షైన్ గా మారుతుంది.
చర్మ పై మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.