రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో సిరిసిల్ల నుంచి వచ్చిన “శ్వాస” హాస్పిటల్ , “హిమాన్షు” హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వైద్య సిబ్బందితో కలిసి బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం ప్రారంభించారు.
హిమన్షు హాస్పిటల్( Himanshu Hospital ) డాక్టర్ జి.సురేంద్రబాబు, “హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ ” అనే అంశంపై పోలీస్ బెటాలియన్ సిబ్బందికి అవగాహన కల్పించారు.వ్యాధికి గల కారణాలు – నివారణలను వివరించారు.సిబ్బందికి విధి నిర్వహణలో నిత్యజీవితంలో ఎదురయ్యే కొన్ని మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు.శ్వాస హాస్పిటల్ డాక్టర్ పి.యస్ రాహుల్ ఫల్మనాలజి ఫంక్షనింగ్ టెస్ట్ నిర్వహించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా, ఊపిరితిత్తుల పనితీరుపై గల అనుమానాలు నివృత్తి చేసి తగు సలహాలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ “హెల్త్ ఈజ్ వెల్త్( Health Is Wealth ) ” అని పోలీస్ సిబ్బంది యొక్క విధులు మిగతా వారితో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయని, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వల్ల హెల్త్ గురుంచి కేర్ తీసుకునే టైమ్ ఉండదు కానీ ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వ్యాయామం, యోగ లాంటివి చేయాలనీ అన్నారు.సిబ్బందికి పి.యఫ్.టి, బి.పి, షుగర్ మొదలైన వైద్య పరీక్షలు నిర్వహించి తగు సలహాలు సూచనలు చేశారని తెలిపారు.ఈ సందర్భంగా శ్వాస హాస్పిటల్ మరియు హిమన్షు హాస్పిటల్స్ వైద్య బృందానికి కమాండెంట్ కె.సుబ్రమణ్యం గారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ ఎ.జె.పి నారాయణ, శ్రీ యమ్.పార్థసారథి రెడ్డి , అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







