మచ్చలను మాయం చేసే మీగడ.‌. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మచ్చలు పడుతుంటాయి.మొటిమలు, వయసు పై బ‌డటం తదితర కారణాల వల్ల చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి.

 How To Use Fresh Cream For Removing Blemishes On Your Face Fresh Cream, Blemis-TeluguStop.com

ఇవి మన అందాన్ని దారుణంగా పాడు చేస్తాయి.ఈ క్రమంలోనే మచ్చలను వదిలించుకోవడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

ఖరీదైన క్రీమ్.సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారుజ‌ కానీ పైసా ఖర్చు లేకుండా మీగడ ( Meegada )తో మచ్చలను మాయం చేసుకోవచ్చు.

పాలు లేదా పెరుగు మీద మీగడ తీసి ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్‌ లో పెట్టడం అందరి ఇళ్ళలో రోజూ చూస్తూనే ఉంటారు.

Telugu Tips, Blemishes, Clear Skin, Cream, Meegada, Skin Care, Skin Care Tips-Te

ఈ మీగడ ను ఫ్రెష్ క్రీమ్( Fresh cream ) అని పిలుస్తుంటారు.మీగడ రుచిగా ఉండడమే కాదు బోలెడు పోషకాలను కలిగి ఉంటుంది.చర్మ సౌందర్యానికి మీగడ చాలా బాగా సహాయపడుతుంది.

ఇప్పుడంటే అనేక రకాల మాయిశ్చరైజర్స్ వచ్చాయి.కానీ ఒకప్పుడు చర్మానికి మీగడనే సహజ మాయిశ్చరైజర్ గా వాడేవారు.

అలాగే మీగడ తో మచ్చలను కూడా వదిలించుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మీగడ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పుదీనా జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్,( Mulethi Powder ) నాలుగు చుక్కలు నిమ్మరసం( Lemon juice ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Blemishes, Clear Skin, Cream, Meegada, Skin Care, Skin Care Tips-Te

ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మీ ముఖ చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్న సరే క్రమంగా మాయం అవుతాయి.మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల మీ ముఖ చర్మం స్మూత్ గా షైనీ గా మారుతుంది.ముడతలు చారలు వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు స్కిన్ టైట్ గా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube