భూమ్మీద రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలిని కూడా కొనాల్సిన పరిస్థితులు వస్తాయని పెద్దలు ఎప్పుడో హెచ్చరించారు.ఇప్పుడు అవే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం కాలుష్యం కారణంగా ప్రజలకు స్వచ్ఛమైన గాలి అస్సలు అందడం లేదు.కాగా, స్వచ్ఛమైన గాలి ఇండియాలో ఈ ఐదు ప్రాంతాల్లో బాగా ఉందట.
ఆ ప్రాంతాలేంటో తెలుసుకుందాం.
ప్రపంచ వాయు నాణ్యత సూచికను గురించి తెలిపే ‘ఐక్యూ ఎయిర్’ అనే సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం.
భారతదేశంలో దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్యమైన ప్రదేశంగా ఉంది.కాగా, ఈ శీతాకాలంలో ఈ ఫైవ్ ప్లేసెస్‌లో పర్యటిస్తే స్వచ్ఛమైన గాలి పుష్కలంగా లభిస్తుంది.
అవేంటంటే, ఐజ్వాల్, కోయంబత్తూర్, అమరావతి, దావణగెరె, విశాఖపట్నం.మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ నగరంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
ఇక్కడి వన్యప్రాణుల అభయారణ్యాలు, వంత్వాంగ్ జలపాతాలు, సరస్సులు, హెరిటేజ్ విలేజెస్ అన్ని కూడా చూడదగిన ప్రదేశాలు.

తమిళనాడు స్టేట్‌లోని కోయంబత్తూరులోనూ స్వచ్ఛమైన గాలి ఉంటుంది.‘మాంచెస్టర్ ఆఫ్ సౌతిండియా’గా పిలవబడే ఈ ప్రాంతంలో ద్రావిడ శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది.ఇక ఇక్కడి టూరిజం ప్లేసెస్ చాలా ఫేమస్ అని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రకృతి ప్రేమికుల ఫేవరెట్ స్పాట్ అని తెలుప వచ్చు.పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధిగాంచింది ఈ నగరం.

ఇక్కడి అందమైన ప్రదేశాలను ప్రతీ ఒక్కరు చూడాల్సిందే.కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె నగరానికి సహజమైన నగరంగా పేరుంది.ఇక్కడి సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ పరిశుభ్రమైన గాలి వీస్తుంటుంది.పర్యాటక ప్రదేశాల నెలవుగా ఈ ప్రాంతం ఉంటుంది.తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం ప్రసిద్ధ నగరంగా పేరుగాంచింది.
ఇక్కడి ఇందిరాగాంధీ జూ లాజికల్ పార్కు, బొర్రా గుహలు, మ్యూజియం, వ్యాలీ, వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అన్నీ కూడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.