వేసవి కాలం రానే వచ్చింది.మార్చి నెల నుంచే ఊపందుకున్న ఎండలు.
ఏప్రిల్ వచ్చే సరికి మరింత ముదిరాయి.ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు బయట కాలు పెట్టేందుకే ప్రజలు జంకుతున్నారు.
ఇక ప్రస్తుత వేసవి కాలంలో ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను వేసవిలో తరచూ తీసుకుంటే ఆరోగ్యం, అందం రెండూ రెట్టింపు అవ్వడం ఖాయం.
మరి ఎందుకు లేటు ఆ జ్యూస్ ఏంటో.ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక చిన్న సైజ్ కీరాను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.
అలాగే అర కట్ట పాలకూరను వాటర్‌తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసుకున్న పాలకూర, పది పుదీనా ఆకులు, కీరా స్లైసెస్, చిన్న అల్లం ముక్క, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, హాఫ్ లీటర్ వాటర్ వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ పాలకూర కీరా జ్యూస్‌ను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తాగాలి.వారంలో కనీసం మూడు సార్లు ఈ జ్యూస్‌ను తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.చర్మం మరింత కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది.వెయిట్ లాస్ అవుతారు.కంటి చూపు పెరుగుతుంది.శరీరంలో అధిక వేడి తగ్గు ముఖం పడుతుంది.
కండరాలు శక్తి వంతంగా మారతాయి.వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
నీరసం, అలసట వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మరియు శరీరానికి అవసరం అయ్యే బోలెడన్ని పోషకాలను ఈ జ్యూస్ ద్వారా పొందొచ్చు.కాబట్టి, వేసవిలో ఆరోగ్యం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవడానికి ప్రయత్నించండి.
.