ఒక్కోసారి ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అది పక్క వారు ప్రేరేపించగా జరగొచ్చు లేదా తమలో తామే కోపోద్రిక్తులై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.అలా అవేశం లో తీసుకునే నిర్ణయాలకు గతం, భవిష్యత్తు సంగతి పక్కన పెడితే అవి దారుణమైన ప్రభావాలు చూపించే అవకాశం కూడా లేకపోలేదు అలాంటి ఒక సంఘటన సినిమా ఇండస్ట్రీలో జరిగింది.
ఈ సంఘటన మరెవరికో కాదు అలనాటి స్టార్ డైరెక్టర్ అయిన రాజా చంద్ర( Raja Chandra ) కి జరిగింది ఆయన సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా అనేక గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు పండంటి కాపురానికి 12 సూత్రాలు, వారాలబ్బాయి, మొండిఘటం, జీవన పోరాటం వంటి మంచి సినిమాలకు ఆయన దర్శకుడిగా ఉన్నారు.డియర్ మొత్తం మీదుగా ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడుగా రాజచంద్రకు మంచి పేరుంది.

ఇక రాజా చంద్ర కు వివాహం జరిగే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.ఇక అదే సమయంలో దర్శకత్వం వహిస్తున్న అన్ని సినిమాల్లో కూడా అనువాదయ కారణాల చేత నటి కృష్ణవేణిని పెట్టుకోవాల్సి వచ్చేది ఆయన చేసే ప్రతి సినిమాలో కృష్ణవేణికి( Krishnaveni ) ఒక పాత్ర ఉంటుంది అలాగే కృష్ణవేణితో ఆయన సన్నిహితంగా కూడా ఉండేవారు అప్పటికి వారిద్దరు వివాహం చేసుకోలేదు అయితే ఆయన తీసే ప్రతి సినిమాకు అనంతలక్ష్మి ఫిల్మ్స్( Anantalakshmi Films ) అనే బ్యానర్ సహాయంగా ఉండేది ఆ బ్యానర్ ని భాస్కర్ రావు( Bhaskar Rao ) నడిపించేవారు.కృష్ణవేణి మరియు రాజా చంద్రమధ్య ఉన్న సన్నిహిత్యాన్ని గమనించిన భాస్కరరావు ఒకరోజు షూటింగ్ సమయంలో అందరి ముందే రాజా చంద్రను పట్టుకొని మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అని ప్రశ్నించారు.

మీరు ఎప్పుడూ కలిసే కూర్చుంటున్నారు కలిసే మాట్లాడుకుంటున్నారు ఓకే ఇంట్లో కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారు.మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందా అంటూ నేరుగా అందరి ముందే ప్రశ్నించేసరికి రాజా చంద్ర అహం దెబ్బతింది.వారిద్దరి మధ్య అంతకముందు కాస్త సన్నిహిత్యం ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అది వివాహ బంధానికి దారి తీసే అవకాశం లేదు కానీ భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు వీరిద్దరి గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు దాంతో ఇక వివాహం చేసుకోకపోతే పరువు దక్కదు అని గ్రహించిన రాజా చంద్ర కృష్ణవేణి మెడలో తాళికట్టారు.
వీరిద్దరూ కలిసి పిల్లలను అయితే కనలేదు కానీ కృష్ణవేణికి అప్పటికి తన మొదటి భర్త ద్వారా ఒక కుమార్తె ఉంది.రాజచంద్రకు తన మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.
ఇక రాజా చంద్ర మరణం గురించి, ఆయన చనిపోయిన విధానం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.