రేగి ఆకులతో బ‌రువు త‌గ్గొచ్చు.. ఎలాగో తెలుసుకోండి!

రేగి పండ్లు.చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు.

 Wonderful Health Benefits Of Jujube Leaves! Health, Benefits Of Jujube Leaves, J-TeluguStop.com

ముఖ్యంగా పిల్ల‌లు రేగి పండ్లు క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు.ఆరోగ్య ప‌రంగా కూడా రేగి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తాయి.అయితే రేగి పండ్లే కాదు రేగి చెట్టు ఆకులతోనూ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.రేగి పండ్లు మాదిరిగానే రేగి ఆకుల్లో సైతం బోలెడ‌న్ని పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందు వ‌ల్ల‌నే రేగి ఆకులు ఆరోగ్యానికి అనేక లాభాల‌ను చేకురుస్తాయి.

ముఖ్యంగా అధిక బ‌రువుతో బాధ ప‌డుతున్న వారికి రేగి చెట్టు ఆకులు ఓ వ‌రం అనే చెప్పాలి.

కొన్ని రేగి ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి.ఇప్పుడు గ్లాస్ వాట‌ర్‌లో దంచిన రేగి ఆకుల‌ను వేసి మూత పెట్టి నైటంతా వ‌దిలేయాలి.

ఉదయాన ఖాళీ క‌డుపుతో ఈ నీటిని సేవించాలి.ఇలా రోజూ చేస్తే గ‌నుక రేగి చెట్టు ఆకుల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక పోష‌కాలు శ‌రీర బరువును సూప‌ర్‌గా త‌గ్గిస్తాయి.

అలాగే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సీజ‌నల్ వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డుతున్న వారికి కూడా రేగి చెట్టు ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.ఒక గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే గుప్పెడు క్ర‌ష్ చేసుకున్న రేగి ఆకులు, చిటికెడు మిరియాల పొడి వేసి ప‌ది నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి.

ఆపై వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని సేవించాలి.ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, శ్వాస స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.మూత్ర మార్గంలో ఇన్ఫెక్ష‌న్‌, మూత్రాశ‌యంలో మంట వంటి స‌మ‌స్య‌ల నుంచి కూడా విముక్తి ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube