స్కిన్‌కు మాయిశ్చరైజర్ ఎంత అవసరమో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచడంలోనూ, ముడతలు త్వరగా రాకుండా అడ్డుకోవడంలోనూ, ఎండల వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించడంలోనూ మాయిశ్చరైజర్ అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకే ప్రతి రోజు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే మాయిశ్చరైజర్లన్నీ కెమికల్స్‌తో నిండినవే.
అలాంటి వాటిని వాడటం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉంటాయి అన్నది పక్కన పెడితే నష్టాలు మాత్రం చాలా ఉంటాయి.అందుకే చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్స్నే వాడాలని చెబుతుంటారు.
అయితే అటువంటి ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం.దాని కోసం ముందుగా ఒక గిన్నెలో కప్పు నువ్వులు, వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న నువ్వులు మరియు ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి.స్ట్రైనర్ సాయంతో జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక మందపాట గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు నువ్వుల జ్యూస్, అర కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి.ఆపై దీనిని స్టవ్‌పై దగ్గర పడే వరకు ఉడికించి చల్లారబెట్టుకోవాలి.
బాగా కూల్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్, రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటే మాయిశ్చరైజర్ సిద్ధమైనట్టే.ఈ న్యాచురల్ మాయిశ్చరైజర్‌ను ప్రతి రోజు వాడితే గనుక స్కిన్ బ్రైట్‌గా మెరిసిపోతుంది.
ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.ఒకవేళ ముడతలు ఉన్నా.
అవి క్రమంగా తగ్గుముఖం పడతాయి.కాబట్టి, ఈ మాయిశ్చరైజర్‌ను తప్పకుండా ట్రై చేయండి.