రామ్ గోపాల్ వర్మ.ఈయన గురించి చెప్పుకోవాలంటే ఎన్ని పేజీలు వార్తలు రాసిన సరిపోవు.
అందరూ ఒకే రూట్లో వెళుతూ ఉంటే నాది మాత్రం సపరేట్ రూట్ అంటూ చెబుతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ.అంతేకాదు తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అంటూ నమ్ముతూ ఉంటాడు.
ప్రపంచం మొత్తం కాదు అంటున్నా మీ చావు మీరు చావండి అంటూ ముఖం మీద చెప్పేస్తూ ఉంటాడు.అందుకే రామ్ గోపాల్ వర్మ ఫార్ములా ఇటీవల కాలంలో యూత్ అందరికీ బాగా నచ్చేసింది.
ఇక బ్రతికితే ఒక్కరోజైనా రామ్ గోపాల్ వర్మలా బ్రతకాలి అని అనుకునేవారు నేటి రోజులలో చాలామంది ఉన్నారు అని చెప్పాలి.
మనసులో ఏమున్నా బయటికి మాట్లాడుతూ.
ఇక తన వ్యాఖ్యలతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాడు వర్మ.ఇదే కాంట్రవర్సీ వర్మ ఒకప్పుడు సెన్సేషన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే.
అయితేరామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఎవరితో పడితే వారితో వివాదాలు పెట్టుకుంటాడు.ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో అటు జగపతిబాబుతో వివాదం పెట్టుకున్నాడట వర్మ.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా జగపతి బాబు చెప్పుకొచ్చారు.వీరిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం హీరోయిన్ ఊర్మిళ అన్నది తెలుస్తుంది.
గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా ఊర్మిలా హీరోయిన్ గాయం అనే సినిమా వచ్చింది.సినిమా మంచి విజయాన్ని సాధించింది.అయితే ఈ సినిమా సమయంలో హీరోయిన్ నచ్చలేదు అని చెప్పావ్ ఎందుకు అని జగపతిబాబును అడిగారట వర్మ.నేను నచ్చలేదు అని అనలేదు.ఆ హీరోయిన్ కి నాకు కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు అని చెప్పాను అంతే అని సమాధానం చెప్పాడు జగపతిబాబు.ఇక తర్వాత హీరో నువ్వు నచ్చలేదు అంటున్నాడు అంటూ వర్మ ఏకంగా ఊర్మిళకు చెప్పాడు.
ఆ తర్వాత ఆమె వచ్చి అడగడంతో అతి పెద్ద రచ్చగా మారింది అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు.ఊర్మిళ నచ్చింది అని చెబితేనే నేను సినిమా కంటిన్యూ చేస్తానని వర్మ చెప్పాడు.
ఆ సమయంలో నేను ఒకటి చెప్పా.నాకు రామ్ గోపాల్ వర్మ అస్సలు నచ్చలేదు.
ఊర్మిళ నచ్చలేదు.ఇక శ్రీదేవి నీకు నచ్చింది కాబట్టి నాకు నచ్చలేదు.
జయసుధ నీకు నచ్చింది కాబట్టి నాకు నచ్చలేదు అంటు చెప్పాను.అంతలో నువ్ మాట్లాడే తీరు నాకు నచ్చింది అంటూ వర్మ కలగజేసుకుని సినిమా కంటిన్యూ చేశాడు అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు.