సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్స్ వాడమని టీవీల్లో కొన్నేళ్ళుగా చెబుతున్నారు మన సినిమాతారలు, క్రికేట్ వీరులు.ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది కండోమ్ అవసరాన్ని గ్రహించలేకపోతున్నారో మనకు తెలియదు కాని, కండోమ్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రం ఇక్కడ చెబుతున్నాం.
చదివి తెలుసుకోండి.
* ఒక పూరాతనమైన పేయింటింగ్ ప్రకారం చూస్తే, కండోమ్ ఇప్పుడిప్పుడే రాలేదు.12,000 నుంచి 15,000 సంవత్సరాల క్రింద కూడా కండోమ్స్ వాడేవారు.
* ఆధునిక యుగంలో కండోమ్ ని కనిపెట్టింది గాబ్రీలే ఫాల్లోపియో.
ఇతను తాను తయారు చేసిన కండోమ్ ని 1100 మందితో వాడించాడు.
* 19వ శతాబ్దంలో జర్మన్ మిలిటరీ వారు కండోమ్ ని ప్రాచూర్యంలోకి తెచ్చారు.
దాని తరువాత దీన్ని అమెరికాలో వాడటం మొదలుపెట్టారు.
* ప్రతీ ఏడాది 50,00,00,000 కి పైగా కండోమ్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతాయట.
* కండోమ్ కి రంధ్రం పడుతుందో లేదో టెస్ట్ చేయడానికి ఫ్యాక్టరీలో కరెంట్ ని ఉపయోగించి దాని గట్టిదనాన్ని పరీక్షిస్తారట.
* ఒక మామూలు కండోమ్ లో ఒక గాలన్ ద్రవాన్ని నింపొచ్చు.
* ప్రపంచంలో అత్యంత పెద్ధదైన కండోమ్ పొడవు 260 ఫీట్లు.మీరు అనుకున్నట్టుగానే దీన్ని ఎవరు వాడరు.
కేవలం ప్రదర్శన కోసమే.
* స్వీడన్ లో కొంతకాలం క్రితం కండోమ్ ఆంబులెన్స్ ఉండేది.
ఎమెర్జెన్సిలో ఎవరైనా కండోమ్ కోసం సంప్రదిస్తే, అడ్రెస్ కి కండోమ్ పంపించేవారు.