ఫేస్ డార్క్ గా డల్ గా మారిందా.. 10 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా!

సాధారణంగా ఒక్కోసారి ఫేస్ డార్క్ గా మరియు డల్ గా మారిపోతూ ఉంటుంది.స్కిన్ టాన్( Skin Tan ) అవ్వడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం అందుకు ప్రధాన కారణాలు.

 Follow This Home Remedy To Repair Dark And Dull Skin In 10 Minutes Details, Hom-TeluguStop.com

అయితే అటువంటి చర్మాన్ని రిపేర్ చేయడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ ఉంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే కేవలం 10 నిమిషాల్లో డార్క్ అండ్ డల్ ఫేస్ ను వైట్ గా, బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) మరియు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి( Besan Flour ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తో పాటు సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Besan, Coffee Powder, Dark Skin, Dull Skin, Skin, Remedy, Potato, S

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని పదినిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని తడి వేళ్ళతో రబ్బింగ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.త‌ద‌నంత‌రం వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్‌ హోమ్ రెమెడీని వారానికి రెండుసార్లు ప్రయత్నించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

Telugu Tips, Besan, Coffee Powder, Dark Skin, Dull Skin, Skin, Remedy, Potato, S

ముఖ్యంగా ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.

చర్మాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మెరిపిస్తుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటిస్తే ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.

ఫేషియల్ గ్లో ను మరియు ఫేషియల్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ను ఈ రెమెడీ మీకు అందిస్తుంది.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

అందంగా మెరిసిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube