గత కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు అనే విధంగా రెండు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ వివాదాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అల్లు అర్జున్ ( Allu Arjun ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కి కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడంతో మరింత ముదిరి పోయాయని తెలుస్తోంది.
ఇలా ఇండస్ట్రీ అలాగే మెగా కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు.కానీ అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం అండగా నిలిచారు.
దీంతో మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ దూరం పెట్టారు అలాగే నాగబాబు ( Nagababu )ప్రత్యర్థికి పనిచేసేవాడు మా వాడు అయిన పరాయి వాడే అంటూ సంచలనమైన పోస్ట్ చేశారు.
ఇలా అల్లు అర్జున్ చేసిన ఈ పని కారణంగా రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తుంది.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఈ క్రమంలోనే ఈయన మంత్రిగా ఇటీవల కర్ణాటక పర్యటనకు వెళ్లారు.అక్కడ హీరోల గురించి మాట్లాడుతూ ఈయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఒకప్పుడు హీరోలు సినిమాలు చేస్తే అడవులను కాపాడుకోవాలన్న సందేశాన్ని తెలియజేస్తూ సినిమాలు చేసేవారు .కానీ ప్రస్తుత హీరోలు మాత్రం స్మగ్లింగ్ చేసే పాత్రలలో నటిస్తున్నారు.మారిన ఈ కల్చర్ ఆందోళన కలిగిస్తుంది.సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడిగా నాకు ఇలాంటి సినిమాలలో నటించడం కష్టంగా అనిపిస్తుంది అంటూ ఈయన కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ ఇలా హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలలో నటిస్తున్నారని మాట్లాడటంతో ఈయన కచ్చితంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా(Pushpa Movie) గురించి మాట్లాడారని తెలుస్తోంది.ఈ విధంగా అల్లు అర్జున్ తనకు మద్దతు తెలియజేయకపోవడంతోనే మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ టార్గెట్ చేశారని తాజాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నువ్వేమైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ వివాదం పుష్ప2 సినిమాపై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు.