కొత్తగా కొన్న చెప్పులు కరుస్తున్నాయా...అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

అందమైన డిజైన్ ఉన్న చెప్పులను ఏంతో మోజు పడి మరీ కొనుక్కుంటాం.అయితే అవి కొన్ని రోజుల పాటు పాదాల మీద ఒత్తిడి కలిగించి కరుస్తూ చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.

 Home Remedies For Shoe Bites-TeluguStop.com

కొత్త చెప్పులు కరిచినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవటానికి సాధారణమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్ లో వేసి కాపడం పెట్టటం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇది నొప్పిని తగ్గించటమే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది.

కలబందలో హీలింగ్ లక్షణాలు ఉండుట వలన నొప్పి ప్రాంతంలో కలబంద జెల్ ని రాస్తే నొప్పి,మంట అన్ని తగ్గిపోతాయి.ఇంటి పెరటిలో ఉండే కలబంద మొక్కను ఉపయోగించవచ్చు.ఇంటిలో లేనివారు మార్కెట్ లో దొరికే జెల్ ని వాడవచ్చు.

ఆస్ప్రిన్ మాత్ర కూడా చాలా బాగా పనిచేస్తుంది.ఆస్ప్రిన్ మాత్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన నొప్పి,వాపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఆస్ప్రిన్ మాత్రను పొడిగా చేసి దానిలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ నూనె మరియు బాదం నూనెను రెండింటిని సమాన భాగాలలో తీసుకోని బాగా కలిపి చెప్పులు కరిచిన ప్రాంతంలో రాశి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube