నందమూరి నటసింహం నటుడు బాలకృష్ణ( Balakrishna ) వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో( Unstoppable Talk Show ) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో సక్సెస్ అందించారు.
మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో ఇక ఈ కార్యక్రమం తదుపరి సీజన్లను కూడా ప్రారంభించింది.ఇప్పటికే మూడు సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తి అయ్యాయి.
ఇక త్వరలోనే నాలుగవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ కార్యక్రమ ప్రసారానికి సంబంధించి ఆహా అధికారక ప్రకటన కూడా వెల్లడించింది.త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ ప్రారంభం కాబోతుందని ఆహా వెల్లడించిన ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయాలను మాత్రం తెలియజేయలేదు.బహుశా ఈ కార్యక్రమం దసరా పండుగను పురస్కరించుకొని మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతూ ఉంటారు వారికి బాలకృష్ణ తనదైన శైలిలోనే ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతూ ఉంటారు.
ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి గోపీచంద్ , ప్రభాస్, మహేష్ బాబు రవితేజ, పవన్ కళ్యాణ్ ( Gopichand, Prabhas, Mahesh Babu Ravi Teja, Pawan Kalyan… )వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ వంటి రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.మరి సీజన్ ఫోర్ కార్యక్రమంలో ఎవరు గెస్ట్లుగా రాబోతున్నారనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది.
ఎక్కువగా ఈ కార్యక్రమానికి సినిమా ప్రమోషన్లలో భాగంగా సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే మరోసారి అల్లు అర్జున్ ,రామ్ చరణ్, ఎన్టీఆర్ చిరంజీవి వంటి పాన్ ఇండియా స్టార్ హీరోలు సీజన్ 4 కార్యక్రమంలో హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.
మరి గెస్ట్ ల గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.