2012లో విడుదలైన ‘త్రీ’ సినిమా ( ‘Three’ movie) మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డీ’ ( Why This Kolaveri Dee )పాట యూట్యూబ్ ని షేక్ చేసింది.
అప్పట్లో ఈ పాటకు కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చాయి.యూట్యూబ్ యాప్ ఇండియాలో అప్పటికి ఇంకా పాపులర్ కాలేదు.
కానీ ఈ సాంగ్ వినడం కోసమే కోట్లాదిమంది యూట్యూబ్‌ను వాడటం మొదలుపెట్టారు.ఇండియన్లకు యూట్యూబ్‌లో వైరల్ అనే పదాన్ని ఈ పాటే పరిచయం చేసింది.
అది అంత వేగంగా ఎక్కువ వ్యూస్ సంపాదిస్తూ సంచలనమే సృష్టించింది.అనిరుధ్ రవిచందర్ ( Anirudh Ravichander )కంపోజ్ చేసిన ఈ సాంగ్ అతనికి చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ కాలంలో యూట్యూబ్ సంస్థ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సాంగ్‌గా ‘కొలవెరీ డీ’ని పేర్కొంది.అంతే కాదు దానికి ఒక గోల్డ్ మెడల్ అవార్డును కూడా ఇచ్చి అభినందించింది.అయితే ఇంత పెద్ద హిట్ అయిన ఈ పాటను మొదటగా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని అనుకోలేదు.మూవీ టీమ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేద్దామంటే అనిరుధ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు.
అప్పట్లో ఆడియో సీడీలు బయటికి వచ్చేవి.అవి మార్కెట్లోకి రావాలంటే కనీసం వారం రోజులు పట్టేది.
ఆ సీడీలు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చి వారిని సర్ ప్రైజ్ చేయాలని అనిరుద్ ఎంతో ఆశపడ్డాడు కానీ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని మూవీ టీం అనడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాడు.
ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక స్టూడియో ఈ పాటను అఫీషియల్ మేకర్స్ కంటే ముందుగానే లీక్ చేసింది.అది ఒక బ్యాడ్ వర్షన్.అది ప్రజల్లోకి వెళ్లిపోతే ఆ పాట పై ఉన్న ఇంప్రెషన్ మొత్తం చెడిపోతుంది.
అందుకే మూవీ మేకర్స్ అఫీషియల్ సాంగ్ ను త్వరగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు.సీడీల ద్వారా వాటిని రిలీజ్ చేస్తే చాలా లేట్ అయిపోతుందని యూట్యూబ్ లోనే విడుదల చేశారు.
అనిరుధ్ అయిష్టంగానే ఇందుకు ఒప్పుకున్నాడు.అయితే ఈ పాట అప్లోడ్ చేసిన ఫస్ట్ రోజే రెండు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
తర్వాత మిలియన్లలో వ్యూస్ సంపాదించి అది ఇండియాని షేక్ చేసింది.అప్పటికి అనిరుధ్ కు 20 ఏళ్లే.
అంత చిన్న కుర్రాడు ఇంత మంచి పాటను కంపోజ్ చేశాడని తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోయారు.దీనివల్ల అనిరుధ్ కు చాలా మంచి పేరు వచ్చింది.
ఇదే సాంగ్‌ని పలువురు విదేశీ సింగర్స్ కూడా పాడుతూ ఈ పాటను మరింత పాపులర్ చేశారు.ఇప్పటికీ ఈ సాంగ్ వినేవారు ఉన్నారు.
యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన టైమ్ నుంచి ఇప్పటిదాకా “వై దిస్ కొలవెరి డీ” పాటకు 46 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.