విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ), రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.‘గీత గోవిందం’ ( Geetha Govindam ), ‘డియర్ కామ్రెడ్’ ( Dear Comrade ) వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ జంట రిలేషన్‌షిప్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
వీరి మధ్య ఉన్న స్నేహం గురించి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి.వేకేషన్స్‌కి కలిసి వెళ్లడం, బయట హోటల్స్‌లో ఒకేచోట కనిపించడం వంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా వీరిద్దరి జిమ్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.ఆ వీడియోలో రష్మిక వాకర్ సాయంతో జిమ్ నుండి బయటకు వస్తుండగా.కారు ఎక్కడానికి ఇబ్బంది పడుతోంది.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడు విజయ్ దేవరకొండ ఆమెకు సాయం చేయలేదు.ఈ విషయం రష్మిక అభిమానులను తీవ్ర అసహనానికి గురిచేసింది.‘తన గర్ల్‌ఫ్రెండ్‌ను అలాంటి పరిస్థితిలో సాయం చేయకుండా వదిలేయడం ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ ఇప్పటి వరకు తమ రిలేషన్‌షిప్ గురించి క్లారిటీ ఇవ్వలేదు.అయితే రష్మిక విజయ్ ఇంటికి పలుమార్లు వెళ్లిందంటూ వచ్చిన వార్తలు, వీరిద్దరూ కలిసి హాలిడే ట్రిప్స్‌కు వెళ్లడం వంటి విషయాలు ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఊహిస్తున్నారు.కానీ వీరు మాత్రం ఈ పుకార్లపై ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు.ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా ‘ఛావా’ ( Chhaava ), ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ( The Girlfriend ), ‘రెయిన్ బో’ ( Rainbow ) సినిమాల్లో నటిస్తుండగా.
విజయ్ దేవరకొండ ‘VD-12’, ‘VD-14’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక ‘VD-14’ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక నటించనుందని రూమర్ ఉంది.సోషల్ మీడియాలో వీరి జంటపై జరుగుతున్న చర్చలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.విజయ్ – రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారా? అంటే సమాధానం మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది!
.