మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో 52 అడుగుల శ్రీ రాముడి విగ్రహాం ఏర్పాటు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారు శ్రీకారం చుట్టారు.గత నెల రోజుల క్రితం అనంతపురం జిల్లా మడకశిర మండలం పిల్లిగుండ్ల గ్రామం నుంచి 156 టైర్ల ప్రత్యేక వాహనంలో బయలుదేరిన రాముడి ఏకశిల విగ్రహం శనివారం మంత్రాలయం చేరుకుంది.
శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారు వాహనానికి ప్రత్యేక పూజలు చేపట్టి స్వాగతం పలికారు.వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య రాముడి ఏకశిల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది.
భారీ వాహానం కావడంతో మంత్రాలయం వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా మంత్రాలయం పోలీసులు ఏర్పాట్లు చేశారు.