కే‌సి‌ఆర్ కు మహిళల ఎఫెక్ట్ తప్పదా ?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న బి‌ఆర్‌ఎస్( BRS party ) కు మహిళలు షాక్ ఇచ్చే అవకాశం ఉందా ? ఇటీవల బి‌ఆర్‌ఎస్ రిలీజ్ చేసిన ఫస్ట్ తో కే‌సి‌ఆర్ డైలమాలో పడ్డరా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.119 స్థానాలకు గాను 115 స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కే‌సి‌ఆర్.( CM kcr ).అందులో మహిళలకు పెద్దగా ప్రదాన్యం ఇవ్వలేదని ఆయన పై గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఉమ్మడి పది జిల్లాల్లో కనీసం పది మంది మహిళా అభ్యర్థులు కూడా లేరని కే‌సి‌ఆర్ విడుదల చేసిన మొదటి జాబితాపై విమర్శలు వస్తున్నాయి.దీన్ని ప్రత్యర్థి పార్టీలు ప్రధాన విమర్శనాస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి.

 Is The Women's Effect Wrong For Kcr, Cm Kcr, Brs Party , Bjp Party, Bade Nagajyo-TeluguStop.com
Telugu Bade Nagajyothi, Bjp, Brs, Cm Kcr, Congress, Kova Laxmi-Politics

అన్నీ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కలిపిస్తున్నామని పదే పదే చెప్పే కే‌సి‌ఆర్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విషయంలో మాత్రం ఎందుకు అవకాశాలివ్వలేని కే‌సి‌ఆర్ పై వేలెత్తి చూపిస్తున్నారు.115 మంది అభ్యర్థులలో ఏడుగురు మహిళలకే టికెట్ ఇవ్వడం దేనికి సంకేతం అని కే‌సి‌ఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో ఈ అంశం బి‌ఆర్‌ఎస్ కు ఎఫెక్ట్ అవ్వనుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సాయన్న కూతురు లశ్య నందిత, ఆసిఫాబాద్ స్థానానికి కోవా లక్ష్మి( kova laxmi ) ములుగు స్థానానికి నాగజ్యోతి.

.( Nagajyothi ) ఇలా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బి‌ఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్ లో మహిళలు కనిపిస్తున్నారు.

Telugu Bade Nagajyothi, Bjp, Brs, Cm Kcr, Congress, Kova Laxmi-Politics

ఇక మరో నాలుగు నియోజిక వర్గాల్లో అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్న కే‌సి‌ఆర్.ఆ నాలుగు నియోజిక వర్గాలను మహిళలకే కేటాయిస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే.అటు కాంగ్రెస్ పార్టీ( Congress party ) మహిళలకు అధిక ప్రదాన్యం ఇస్తామని వారికే అధికంగానే సీట్ల కేటాయింపు జరుపుతామని చెబుతోంది.ఇటు బీజేపీ కూడా మహిళలకే ఎక్కువ ప్రదాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

దీంతో మహిళా అంశం బి‌ఆర్‌ఎస్ కు ఎఫెక్ట్ కానుందనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం.అయితే నియోజిక వర్గాల వారీగా ప్రజాభిప్రాయాన్ని బట్టే సీట్ల కేటాయింపు జరిపినట్లు బి‌ఆర్‌ఎస్ చెబుతోంది.

మరి ఎన్నికల్లో ఈ ప్రభావం బి‌ఆర్‌ఎస్ పై ఎంతమేర ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube