జబర్దస్త్ వదిలేసిన అనసూయ క్రిష్( Krish Jagarlamudi ) డైరెక్షన్ లో ఒక భారీ వెబ్ సీరీస్ చేస్తుందని వార్తలు వచ్చాయి.గురజాడ అప్పారావు కన్యాశుల్కం కథను వెబ్ సీరీస్( Kanyasulkam ) గా చేస్తున్నారని.
అందులో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనుందని చెప్పారు.అనసూయ ఆ వెబ్ సీరీస్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేందుకే జబర్దస్త్ వదిలేసిందని.
అందుకు గాను అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని అన్నారు.కానీ అనసూయ వెబ్ సీరీస్ ఇప్పటివరకు ముందుకు వెళ్లలేదు.
ఓ పక్క క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా పూర్తి కాలేదు.ఆ సినిమా పూర్తైన తర్వాత అయినా ఈ వెబ్ సీరీస్ ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు.పవన్ సినిమా తర్వాత క్రిష్ మరో భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.
మొత్తానికి అనసూయ( Anasuya )తో క్రిష్ వెబ్ సీరీస్ భారీ క్రేజ్ తో వార్తలు రాగా ఆ సీరీస్ సెట్స్ మీదకు వెళ్లడం డౌటే అని అంటున్నారు.స్మాల్ స్క్రీన్ వదిలి పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కు ఫిక్స్ అయిన అనసూయ కొత్త ప్రయత్నాలు చేయాలని చూస్తుంది.పుష్ప 1 లో ఆమె దాక్షాయణి పాత్రలో అలరించిన విషయం తెలిసిందే.