అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మాయమాటలు చెప్పేవారిని నమ్మకూడదని కథ చెబుతోందని సీఎం జగన్ అన్నారు.ఈ కథ వింటే చంద్రబాబు గుర్తుకు వస్తారన్నారు.
జాబు రావాలంటే.బాబు రావాలని యాడ్స్ వచ్చేవని ఎద్దేవా చేశారు.
తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు చెబుతారు.అటువంటి బాబుతో ఓ గజదొంగల ముఠా ఉండేదని జగన్ విమర్శించారు.
చంద్రబాబుకు ఓ దత్తపుత్రుడు కూడా ఉన్నాడన్నారు.అబద్ధాలు, మోసాలను నమ్మొద్దన్న జగన్ తన నమ్మకం, విశ్వాసం ప్రజలేనని స్పష్టం చేశారు.







