స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ తొలిరోజు కలెక్షన్లు 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి.ఈ సినిమా 79 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
అయితే తెలుగులో ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా క్రిటిక్స్ ప్రభాస్ నటనను మెచ్చుకున్నారు.ప్రభాస్ ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాలో మరింత అందంగా కనిపించాడని కామెంట్లు చేశారు.
అయితే బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ప్రభాస్ ను పర్సనల్ గా టార్గెట్ చేయడం గమనార్హం.బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
ఈ సినిమాలతో ప్రభాస్ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నారు.సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో మాత్రం ఏకంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే రాధేశ్యామ్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడం లేదు.
రాధేశ్యామ్ సినిమా హిందీలో తొలిరోజు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సినిమా బాలేదని పోస్ట్ పెట్టగా క్రిటిక్ అనుపమ్ చోప్రా ప్రభాస్, భాగ్యశ్రీ మధ్య వయస్సు తేడా గురించి కామెంట్లు చేశారు.
వయస్సును చూసి పాత్రలకు నటీనటులను ఎంచుకోవాలని ఆమె సూచించారు.బాలీవుడ్ క్రిటిక్స్ కావాలని ప్రభాస్ ను టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ అక్కడి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ తరువాత సినిమాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటారో చూడాలి.