ఈ సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే కిడ్నీ స్టోన్స్ కు దూరంగా ఉండొచ్చు తెలుసా?

మూత్రపిండాల్లో రాళ్లు లేదా కిడ్నీ స్టోన్స్( kidney stones )ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది.మూత్రంలో ఖనిజాలు లేదా లవణాలు పేరుకుపోయినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

 These Super Foods Help To Reduce Kidney Stones Risk! Kidney Stones, Super Foods,-TeluguStop.com

ఈ రాళ్లు కారణంగా చాలా బాధకు గురవుతారు.ఒక్కోసారి కిడ్నీలో స్టోన్స్ ను రిమూవ్ చేయడానికి ఆపరేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అందుకే సమస్య వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్యకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరి ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Healthy, Healthy Kidneys, Kidney, Latest, Foods-Telugu Health

స్ట్రాబెర్రీ పండ్లు( Strawberries ) రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.ముఖ్యంగా స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా, ఆక్సిలేట్లు తక్కువగా ఉంటాయి.అందువల్ల వీటిని తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే రిస్క్ తగ్గుతుంది.

అలాగే వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా పుచ్చకాయను తినాలి.పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

అందువల్ల పుచ్చ‌కాయను తరచూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.బాడీ హైడ్రేటెడ్ గా సైతం ఉంటుంది.

రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్లు నిమ్మరసం( Lemon water ) కలుపుకుని తీసుకోవాలి.నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.

ఇది మూత్రపిండాల్లో కొన్ని రకాల స్టోన్స్ ను ఏర్పడకుండా అడ్డుకట్ట వేస్తుంది.అలాగే వారానికి ఒకసారైనా బ్రోకలీని తీసుకోవాలి.

పోషకాలకు పవర్ హౌస్ లాంటి బ్రోకలీలో కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది.ఇది పొట్టలోని ఆక్సలేట్ లను అతుక్కుని కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

Telugu Tips, Healthy, Healthy Kidneys, Kidney, Latest, Foods-Telugu Health

ఆలివ్ ఆయిల్( Olive Oil ) ను తీసుకోవడం ద్వారా కూడా కిడ్నీ స్టోన్స్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.ఆలివ్ ఆయిల్ ఆక్సలేట్ శోషణ ను తగ్గించడంలో సహాయపడుతుంది.తక్కువ కొవ్వు ఉండే పాలు, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాలు కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఇక ఈ ఫుడ్స్ తో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోండి.

అలాగే ఉప్పును తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించండి.వారానికి కనీసం ఐదు రోజులైనా వ్యాయామం చేయండి.

మరియు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube