స్టార్ హీరో ప్రభాస్ కు ఇష్టమైన ఆట ఏంటో తెలుసా.. ఆ ఆటను ఇష్టంగా ఆడతారా? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Do You Know The Favorite Game Of Star Hero Prabhas, Do You Like To Play That Gam-TeluguStop.com

ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆటలపై చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ కి కూడా ఒక ఆట అంటే ఇష్టమని వెల్లడించారు.

Telugu Favoritegame, Game, Prabhas, Prashanth Neel, Sai Pallavi, Salaar-Movie

గతంలో రాజమౌళి( Rajamouli ) కమాన్‌ ఇండియా పేరుతో ఓ సెలబ్రిటీ షో చేశారు.ఇందులో స్పోర్ట్స్ ( Sports ) గురించి అవగాహన, ఆటలను ఎంకరేజ్‌ చేయాలని, ప్రభుత్వాలు వీటిపై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రామ్‌ చేశారు.ఈ కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మరి ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి ప్రభాస్ ని ఉద్దేశిస్తూ మీకు ఏ ఆట అంటే ఇష్టమని ప్రశ్నించగా తనకు వాలీబాల్ ( Vollyball ) అంటే చాలా ఇష్టం అని తెలిపారు.అయితే ఈ ఆట ఇష్టపడటానికి కారణాన్ని కూడా ప్రభాస్ తెలిపారు.

Telugu Favoritegame, Game, Prabhas, Prashanth Neel, Sai Pallavi, Salaar-Movie

స్కూల్‌ టైమ్‌లో వాలీబాల్‌ ఆడటం స్టార్ట్ అయ్యిందట.స్కూల్‌లో టీములు చేసేసమయంలో నేను హైట్‌ ఉన్నానని తోసేశారు.అలా నెమ్మదిగా ఆ గేమ్‌ ఆడటం స్టార్ట్ చేశాను.అలా ఈ ఆటపై చాలా ఇష్టం పెరిగిందని ప్రభాస్ తెలిపారు.ఇక తన గెస్ట్ హౌస్ లో వాలీబాల్ కోర్టు ఉందని, ఇప్పటికీ ( ఈ షో సమయంలో) కూడా తాను వారానికి ఒకసారైనా వాలీబాల్ ఆడతానంటూ ప్రభాస్ తెలిపారు.అయితే ఇప్పుడు ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు కనుక బహుశా అంత టైం ప్రభాస్ కి ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఈయనకు వాలీబాల్ అంటే ఇష్టమని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube