ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా నామినేషన్ ర్యాలీలు( Nomination Rallies ) పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.రోడ్లు మొత్తం కూడా భారీ జన సందోహంతో కిక్కిరిసిపోతున్నాయి.
ఒకవైపు వైసీపీ మరొకవైపు టీడీపీ, జనసేన పార్టీ నేతలు రాజకీయ నాయకులు నామినేషన్ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి.
నిన్న పెనమలూరు నుంచి బరిలోకి దిగుతున్న మంత్రి జోగి రమేష్ నామినేషన్ ర్యాలీలో, నేడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( Gudivada MLA Kodali Nani ) నామినేషన్ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో అభిమానులు హంగామా చేశారు.
![Telugu Jr Ntr, Ntrflexis, Kodali Nani, Ntr Flexis-Movie Telugu Jr Ntr, Ntrflexis, Kodali Nani, Ntr Flexis-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Junior-NTR-Photos-Flexis-at-Kodali-Nani-Nomination-Rally.jpg)
జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు( Junior NTR Flexis ) ఉన్న ప్లకార్డులు, జెండాలు చేతబట్టి నామినేషన్ ర్యాలీలో అభిమానులు పాల్గొన్న ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జోగి రమేష్( Jogi Ramesh ) నామినేషన్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు హాట్ టాపిక్ అయ్యాయి.నిజానికి ఒకప్పుడు కొడాలి నాని టీడీపీలో ఉండగా ఎన్టీఆర్ కి ప్రధాన అనుచరుడు అనే పేరు ఉంది.
అయితే నాని పార్టీ మారాక తనకు నానికి స్నేహమే కానీ పొలిటికల్ గా తాను తన తాత పెట్టిన టీడీపీ( TDP )లోనే ఉంటానని పేర్కొన్నారు.
![Telugu Jr Ntr, Ntrflexis, Kodali Nani, Ntr Flexis-Movie Telugu Jr Ntr, Ntrflexis, Kodali Nani, Ntr Flexis-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Kodali-Nani-Nomination-Rally.jpg)
ఇక రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం, గుడివాడ, మైలవరం, అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలు చర్చలో ఉన్నాయి.ఎందుకంటే విజయవాడ ఎంపీ స్థానంలో కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య అన్నదమ్ముల సవాల్ ఉంది.ఇక గుడివాడ నుంచి ఓటమి ఎరుగని కొడాలి నాని ఐదోసారి పోటీకి దిగగా టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము బరిలోకి దిగుతున్నారు.
గన్నవరం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ), టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు పోటీ పడుతున్నారు.వీరు గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు.
ఇక మైలవరంలో వసంత కృష్ణప్రసాద్( Vasantha Krishna Prasad ), సామాన్యుడైన సర్నాల తిరుపతి రావుకి మధ్య పోరు ఆసక్తకరంగా మారింది.అయితే వైసీపీ పార్టీలో టిడిపి వ్యక్తి పోస్టర్లు ఫ్లెక్సీలు కనిపించడంతో ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.