ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఔను.వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కళ్యాణి నటించారు.ఈ సినిమాతో వంశీ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.
ఈ సినిమా కంటే ముందు వంశీ తీసిన సినిమాలు డిజాస్టర్స్ కావడంతో డైరెక్టర్ యానాం వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యారు.అంతలోనే వేమూరి సత్యనారాయణ నుంచి ఫోన్ చేసి హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ బానే ఉందని, మా ఊరికి చెందిన వేమూరి రమేష్ నీతో సినిమా తీస్తాడట అని చెప్పడంతో మళ్ళి బయలుదేరారు.
ఇక స్క్రిప్ట్ రాస్తుంటే వేమూరి రమేష్ అమెరికా వెళ్ళిపోయారంతా దాంతో వంశీ పరిస్థితి మళ్ళీ అయోమయం.
అయితే గంగోత్రి ఉపాధ్యాయ చెప్పిన కథను బేస్ చేసుకుని ఓ స్క్రిప్ట్ రెడీ చేసి, హీరో శివాజితో మూవీ చేయాలనుకున్నారు.
అందుకు మహర్షి మూవీకి ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన వల్లూరిపల్లి రమేష్ నిర్మాతగా మారాలని అనుకున్నారు.దీంతో వంశీతోనే మూవీ చేయాలని రమేష్ సిద్ధమైయ్యారు.ఆలా శ్రావణి సుబ్రహ్మణ్యం చేసి, ఇడియట్ లో నటిస్తున్న రవితేజ అయితే బెటర్ అనుకున్నారు.ఈ సినిమాకి రవితేజ కూడా ఒకే.ముందుగా ఈ సినిమాకి హీరోయిన్ లయ అనుకున్నారు.అయితే శేషు మూవీలో చేసిన కళ్యాణి అయితే బాగుంటుందని అనుకున్నారు.
ఈ సినిమాకి కాకినాడకు చెందిన పాపారావు చౌదరిని రైటర్ గా, నటుడిగా చేసి, కృష్ణ భగవాన్ గా పేరు మార్చింది కూడా వంశీయే అంటా.అయితే ఏప్రియల్ 1విడుదల మూవీలో విలనిజం చేయించిన వంశీ కొత్తగా తీసే సినిమాలో కామెడీ వేషం ఇచ్చారు.ఇక విశాఖ పోర్టులో పనిచేసి రిటైరైన కొండవలస లక్ష్మణరావు కి నాటక అనుభవం ఉండడంతో అయితే ఒకే అనే డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేయించి ఈ సినిమాలో తీసుకున్నారట.ఈ సినిమాలో కట్టిన కాటన్ సారీస్ చాలా బాగున్నాయని కళ్యాణి షూటింగ్ ఆఖరి రోజున చెప్పడంతో అన్నీ తీసుకెళ్లారు.
పట్టుచీరలు ఇచ్చినంత ఆనందంగా పట్టుకెళ్లింది.ఇక చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అందుకుంది.