అమెరికాలో డెల్టా కేసుల సంఖ్యలో రోజు రోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.గత వారంతో పోల్చితే ఈ వారం మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు భారీగా ఉన్నాయంటూ అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడీసి) ప్రకటించింది.
అంతేకాదు మరోక విషయం వెల్లడించిన సిడీసి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయో ఊహించలేమని ప్రకటించింది.అయితే డెల్టా ను కంట్రోల్ చేయగలిగే శక్తి ఇప్పుడు వ్యాక్సిన్ లకంటే కూడా ప్రజలపై ఎక్కువగా ఉందని తెలిపింది.
అయితే సిడీసి ప్రకటించిన ఆ సంచలన విషయం ఏంటంటే.
ప్రస్తుతం అమెరికాలో తయారయిన ఫైజర్ వ్యాక్సిన్ అన్నిటికంటే శక్తివంతమైన వ్యాక్సిన్ గా అభివర్ణిస్తున్నారు నిపుణులు.
మొదటి డోసు తీసుకున్నా కరోనా వచ్చే అవకాశాలే లేవని చెప్పి డప్పులు కొట్టుకున్న సదరు ఫార్మా కంపెనీ కొద్ది రోజుల్లోనే రెండవ డోసు కూడా తీసుకోవాలంటూ ప్రకటించింది.అయితే అమెరికాలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో డెల్టా వేరియంట్ ను తట్టుకోవాలంటే తప్పకుండా మూడవ డోసు కూడా ప్రజలు తీసుకోవాలని సిడీసి ప్రకటించింది.
సిడీసి చేసిన ఈ ప్రకటనతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి పడ్డాయి.రెండు డోసులు తీసుకున్న ఫైజర్ పనిచేయదని మూడవ డోసు కూడా తీసుకోవడం ఎవరికి లాభమంటూ నెటిజన్లు విమర్శలు కూడా చేశారు.
అయితే ప్రస్తుతం మరో సంచలన విషయం వెల్లడించింది అమెరికా సిడీసి.అమెరికా వ్యాప్తంగా డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచీ కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఇలా సోకినా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోందని సిడీసి ప్రకటించింది.
ఈ విషాన్ని ప్రభుత్వం ప్రజలు తెలిసేలా చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని అమెరికా చూడాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేసింది సిడీసి.