ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు చక్కెర( Sugar )ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.కానీ గతంలో బెల్లం ఎక్కువగా ఉపయోగించేవారు.
నేటికీ బెల్లం( Jaggery ) వాడేవారు కూడా ఉన్నారు.కానీ దీన్ని వినియోగించేవారు చాలా తక్కువగా ఉన్నారు.
చక్కెరను ఎక్కువగా ప్రస్తుత సమాజంలో ఉపయోగిస్తున్నారు.చక్కర కంటే బెల్లం ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అలాగే చక్కెర చాలా ప్రమాదకరమైనదని గుర్తుపెట్టుకోవాలి.ఈ రోజు మనిషిని పట్టిపీడిస్తున్న వ్యాధులలో చాలావరకు షుగర్ ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కానీ బెల్లం చాలా పోషకాలతో నిండి ఉంటుంది.ఆరోగ్యం మరియు పోషక ప్రయోజనాల విషయానికి వస్తే ఎవరు బెల్లంతో పోటీ పడలేరు.బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బెల్లం రుచికరంగా ఉంటుందని, దీనిని వాడిన వారికి మాత్రమే తెలుస్తుంది.బెల్లం లోని అనేక పోషకాలు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి.
బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు.బెల్లంలో క్యాల్షియం, జింక్, ఫాస్ఫరస్ మరియు కాపర్ వంటి విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయంనే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో బెల్లం( Jaggery Water ) కలిపి తాగడం వల్ల మనకు తక్షణమే శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ నీటిని తాగవచ్చు.బెల్లం జీవక్రియను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.దీన్ని తీసుకోవడం వల్ల బరువు( Weight ) అదుపులో ఉంటుంది.
అయితే చక్కర ను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
కానీ బెల్లం తినడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే బెల్లం లో క్యాల్షియం( Calcium ) ఎక్కువగా ఉంటుంది.దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
బెల్లం కండరాల పోషణకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం పొడిని నేరుగా గురువేచ్చని నీటిలో కలిపి కూడా తాగవచ్చు.