అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే యానిమల్ వీడియోస్ మన ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి.కొన్ని వీడియోలు చూస్తుంటే వెన్నులో వణుకు కూడా పుడుతుంది.
తాజాగా అలాంటి కోవకు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు పడుతోంది.ఈ వీడియోలో ఒక నది నీటిలో పడవ వెళుతుండగా దారి మధ్యలో వేల సంఖ్యలో మొసళ్లు( Crocodiles ) కనిపించాయి.
ఆ నీటిలో మొసళ్లు భారీ సంఖ్యలో ఉన్నా పడవలో ఉన్నవారు అలాగే ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు.
పడవ( Boat ) వస్తూ ఉంటే మొసళ్లు భయపడి చెల్లా చెదురుగా ఒడ్డు మీదుకు పరిగెత్తడం వీడియోలో మీరు చూడవచ్చు.పడవ కూడా ఆ సమయంలో బాగా ఊగుతూ కనిపించింది.ఒకవేళ ఆ షేకింగ్ వల్ల పడవలోని వారు కింద పడితే ఆ మొసళ్లకు క్షణాల్లో ఆహారం కావడం ఖాయం.
అంతేకాదు వారి బొక్కలు కూడా దొరకవు.ఎందుకంటే అవి చాలా పెద్దగా, అలాగే భారీ సంఖ్యలో ఉన్నాయి.
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు అనేది స్పష్టంగా తెలియ రాలేదు కానీ ఆఫ్రికాలో( Africa ) చిత్రీకరించినట్లు తెలుస్తోంది.నెటిజన్లు మాత్రం ఈ ప్రమాదకరమైన ప్రాంతం బ్రెజిల్‌లోని మాటో గ్రోసోలో ఉందని కామెంట్లు పెట్టారు.
ఈ మొసళ్ల నదిలో( Crocodiles River ) బోట్ తిరగబడితే పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నించారు.అసలు అన్ని మొసళ్లు అక్కడ ఎలా బతుకుతున్నాయి? ఏం తిని బతుకుతున్నాయి? అవి ఎంతటి ఆహారమైనా ఒక్కరోజులోనే ఖతం చేయగలవు కదా అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు.ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో @cctvidiots పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 10 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.ఈ భయంకరమైన వీడియోని మీరు కూడా చూసేయండి.