కోతుల ప్రవర్తన( Monkey Behavior ) మనిషిని తరచుగా ఆశ్చర్యపరుస్తుంది.ఇవి కొన్నిసార్లు అతి కామ్‌గా ఉంటే, మరికొన్నిసార్లు హల్‌చల్ చేస్తుంటాయి.
ఒక్కోసారి ఇళ్లలోని వస్తువులను తీసుకెళ్లి మరోచోట పడేయడం, రహదారుల్లో ఉల్లాసంగా విహరించడం, మనుషుల చేతిలోని ఆహార పదార్థాలను( Food ) లాక్కోవడం వంటి చర్యలు కోతుల నుండి తరచూ కనిపిస్తాయి.అయితే ఇందులో కొన్ని సంఘటనలు షాకింగ్‌గా మారతాయి.
దీనికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
ఇటీవల, అలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన నెట్టింట చక్కర్లు కొడుతోంది.వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన హల్దీ పంక్షన్‌లో( Haldi Ceremony ) ఓ కోతి( Monkey ) చేసిన పనికి అక్కడున్నవారు అవాక్కయ్యారు.హల్దీ వేడుకలో వధూవరులు సోఫాలో కూర్చొని ఉంటే, వారి చుట్టూ యువతులు సందడి చేస్తూ వేడుకను మరింత అందంగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు.
వారిలో ఓ యువతి ప్లేటులో ఆహారాన్ని పట్టుకుని నిలబడి ఉంటుంది.ఇంతవరకూ అంతా సవ్యంగా సాగుతుండగా, అనుకోని ఘటన చోటు చేసుకుంది.
దూరంగా ఉన్న ఓ కోతి ఆ యువతిని టార్గెట్ చేసింది.ఆమె చేతిలోని ఆహారాన్ని కొట్టేయాలని అనుకుని నేరుగా వేదిక వద్దకు వచ్చింది.అంతా చూస్తుండగానే వారి మధ్యలోకి చొరబడి, యువతి చేతిలోని ఆహార పదార్థాలను లాక్కుని అక్కడి నుంచి పరారయింది.ఈ సంఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.కొందరు ఈ ఘటనను చూసి నవ్వుకున్నారు, మరికొందరు అవాక్కయ్యారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్( Viral ) అవుతోంది.
దీనిపై నెటిజన్లు తక్కువ సమయంలోనే అనేక రకాలుగా స్పందిస్తున్నారు.కోతుల ప్రవర్తన ఎంత అంచనా వేయలేనిదో ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.
మనుషుల మనసు చదివినట్టుగా, వీటి క్రియాశీలత అప్పుడప్పుడూ నవ్వులను తెప్పించేలా చేస్తుంది.ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందించండి!
.