తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు.ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా భారీ గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరోలందరూ ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే యంగ్ హీరోలు మాత్రం స్టార్ హీరోల రేంజ్ లో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే పాన్ ఇండియాలో( Pan India ) తెలుగు సినిమాల హవా భారీ రేంజ్ లో కొనసాగుతుంది.మరి ఇలా ఉంటే సందీప్ కిషన్( Sundeep Kishan ) లాంటి హీరో రీసెంట్ గా ‘మజాకా’( Mazaka ) అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని మూటగట్టుకున్నాడు.
మరి ఈ సినిమాతో వచ్చిందైతే ఏమీ లేదు.ఎప్పుడు వైవిద్య భరితమైన సినిమాలను చేసే సందీప్ కిషన్ ఇప్పుడు మాత్రం ఒక కమర్షియల్ సినిమాని చేశాడు.నిజానికి సందీప్ కిషన్ ఇతర భాషల్లో మంచి సినిమాలను చేస్తాడు.తెలుగుకి వచ్చేసరికి రొటీన్ కమర్షియల్ సినిమాలను చేయాలని చూస్తుంటాడు.

కారణమేంటి అతనికి మంచి కథలు రావడం లేదా తెలుగు దర్శకులు అతనితో మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదా? మరి ఏది ఏమైనా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో రోజురోజుకు అయిన చాలావరకు వెనకబడిపోతున్నాడనే చెప్పాలి.ముఖ్యంగా తెలుగులో అయితే ఆయనకు పెద్దగా మార్కెట్ కూడా క్రియేట్ అవ్వడం లేదు…మరి ఆయన ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు డిఫరెంట్ సినిమాలు చేయచ్చు కదా అంటూ తెలుగు విమర్శకులు సైతం ప్రశ్నిస్తున్నారు…
.