సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి రోజా ( Roja ) ఒకరు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు.
ఇలా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె నగరి నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు.అనంతరం మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.
ఇక రోజా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

ఇక ఈమెకు మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పడంతో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీతో పాటు రోజా కూడా ఓటమిపాలు కావడంతో తిరిగి రోజా ఇండస్ట్రీపై ఫోకస్ చేశారని తెలుస్తుంది.ఇప్పటికే ఈమె జీ తెలుగులో( Zee Telugu ) ప్రసారం కాబోతున్న ఓ కార్యక్రమానికి జడ్జిగా ( Judge ) కూడా వ్యవహరించనున్నారు.
ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా ఒక వేదికపై రోజా డాన్స్ మాస్టర్ ప్రభుదేవా( Prabhu Deva ) తో కలిసి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

తాజాగా ప్రభుదేవా చెన్నైలో లైవ్ డ్యాన్స్ కాన్సర్ట్ నిర్వహించాడు.ఈ ఈవెంట్ కు అనేకమంది సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు.మీనా, రంభ, శ్రీదేవి, నగ్మా, సంగీత, రోజా వంటి సెలెబ్రెటీలు అందరూ కూడా హాజరయ్యారు.ఇక వీరందరూ కూడా వేదికపై పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ సందడి చేశారు.
ఇక పోతే నటి మీనాతో( Meena ) పాటు రోజా కూడా ప్రభుదేవాతో కలసి ఒక తమిళ పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వీడియోని అధికారకంగా విడుదల చేయకపోయినా అక్కడికి వెళ్లినటువంటి ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.ఇలా రోజా డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన అభిమానులు రోజా ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.







