మహేష్( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కాగా ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మహేష్ జక్కన్న బాక్సాఫీస్ వద్ద తమ ప్రాజెక్ట్ తో అద్భుతం చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రాజమౌళి సినిమా నుంచి మహేష్ బాబు లుక్( Mahesh Babu Look ) లీక్ కాగా ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
ఈ లుక్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి మహేష్ బాబును పవర్ ఫుల్ గా చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ లుక్ ను లీక్ చేసిందెవరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.
జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీక్స్ ను మాత్రం పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారు.మరోవైపు ఈ లుక్ ను కావాలనే లీక్ చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు రాజమౌళి తాజాగా ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచారు.జక్కన్నను కావాలని ఈ వివాదంలో ఇరికించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళికి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆ గుర్తింపును తట్టుకోలేక ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా పోస్టులు పెడుతున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.రాజమౌళి రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది.

జక్కన్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2027 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.జక్కన్న ఇతర భాషల ప్రేక్షకులను సైతం తన సినిమాలతో మెప్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.మహేష్ జక్కన్న కాంబో మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.