ఉదయ్ కిరణ్ నాతో మాట్లాడిన చివరి మాటలు ఇవే... నరేష్ సంచలన వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) ఒకరు.ఈయన 2014 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకొని మరణించారు.

 Hero Naresh Sensational Comments On Uday Kiran Death Details, Uday Kiran, Naresh-TeluguStop.com

ఈయన మరణించి దాదాపు ఒక దశాబ్దం పూర్తి అవుతున్న ఇప్పటికీ కూడా అభిమానులు తరచూ ఉదయ్ కిరణ్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి.ఇక ఈయన మరణం గురించి కూడా తరచూ ఏదో ఒక విషయం వార్తల్లో వినపడుతూనే ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా నటుడు నరేష్ ( Actor Naresh ) ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఆయన మరణానికి ముందు తనతో మాట్లాడిన మాటల గురించి అందరితో పంచుకున్నారు.ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈయన మరణించడానికి ముందు ఒకరోజు తనని కలిసినట్టు నరేష్ తెలిపారు.ఆ సమయంలో ఉదయ్ కిరణ్ చాలా డల్ గా కనిపించారు.ఎందుకు అలా ఉన్నావనీ తనని అడిగానని నరేష్ తెలిపారు.అయితే ఆరోజు ఉదయ్ కిరణ్ నాతో మాట్లాడుతూ పేపర్లో ఒక న్యూస్ చూశాను.

యువ హీరోలు( Young Heroes ) సరైన కథలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు అంటూ ఒక ఆర్టికల్ వచ్చిందని ఉదయ్ కిరణ్ నాతో బాధపడ్డారు.

Telugu Allari Naresh, Allarinaresh, Naresh, Tollywood, Uday Kiran-Movie

ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ బాధపడటంతో అయినా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నీ గురించి కాదు కదా అందులో రాసి ఉందని నేను చెప్పాను.  కానీ ఉదయ్ మాట్లాడుతూ సరైన కథలను ఎంపిక చేసుకోకపోతే ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని ఆ పేపర్లో రాశారని బాధపడ్డాడట.దాంతో నరేష్, ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యానని తెలిపారు.

Telugu Allari Naresh, Allarinaresh, Naresh, Tollywood, Uday Kiran-Movie

ఆ విషయంలో ఉదయ్ కిరణ్ చాలా డిప్రెషన్ కి( Depression ) గురైనట్టు ఆ క్షణం నాకు అనిపించింది కానీ కొద్ది రోజులకే ఆయన మరణించడంతో ఆయన మరణానికి ఈ డిప్రెషన్ కారణం కావచ్చు అంటూ నరేష్ ఉదయ్ కిరణ్ చివరిగా తనతో మాట్లాడిన మాటలను బయట పెట్టడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.అనుకోకుండా ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఉదయ్ కిరణ్ కు చివరికి అవకాశాలు లేకపోవడంతోనే ఈయన డిప్రెషన్ కి గురై మరణించారనీ తెలుస్తోంది కానీ సరైన కారణం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube