తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నప్పటికి మరి కొంతమంది తమిళ్ హీరోలు సైతం తెలుగులో వాళ్ళ కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు.ముఖ్యంగా ఆది పినిశెట్టి( Aadhi Pinisetty ) లాంటి హీరో ఇటు హీరోగా సినిమాలను చేస్తూనే, అటు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు చాలావరకు దగ్గరయ్యాడు.
ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన సరైనోడు, రంగస్థలం సినిమాలు ఆయనకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా భారీ ఎత్తున ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించాడు.

ఇక ఇదిలా ఉంటే అరివిలగన్ డైరెక్షన్ లో శబ్దం( Sabdham Movie ) అనే సినిమా చేశాడు.ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయమైతే వరించే విధంగా కనిపించడం లేదని కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.కథలో కన్ఫ్లిక్ట్ బాగున్నప్పటికి సినిమాలో స్క్రీన్ ప్లే అంతా వైవిధ్యంగా లేకపోవడం వలన ఈ సినిమాని చాలా వరకు ప్రేక్షకులు చూడలేకపోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఆది ప్రస్తుతం హీరోగా రాణిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను పాగా వేయాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన బాలయ్య బాబు బోయపాటి కాంబోలో వస్తున్న ‘అఖండ 2’( Akhanda 2 ) సినిమాల్లో కూడా విలన్ గా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే సరైనోడు సినిమాలో మంచి విలనిజాన్ని పండించిన ఆయన మరోసారి బోయపాటి డైరెక్షన్ లో విలన్ గా నటిస్తున్నాడు అనగానే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిలో మంచి అంచనాలైతే రేకెత్తుతున్నాయి…
.