కనురెప్పలు ఒత్తుగా, పొడవుగా ఉంటే కళ్లు ఎట్రాక్టివ్‌గా, ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.అందుకే కొందరు ఆర్టిఫిషియల్ కను రెప్పలను అతికించుకుంటారు.
కానీ, కొందరు మాత్రం న్యాచురల్‌గానే కను రెప్పలను పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సులువుగా కను రెప్పలను పొడవుగా మరియు ఒత్తుగా పెంచుకోవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ తొక్కలు కను రెప్పలను ఒత్తుగా పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ముందుగా ఒక బౌల్లో రెండు లేదా మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో కొన్ని నిమ్మ తొక్కలు వేసి వారం పాటు వదిలేయాలి.అనంతరం ఆ ఆయిల్‌ను కను రెప్పలకు అప్లై చేయాలి.
ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే కను రెప్పులు మంచిగా పెరుగుతాయి.
అలాగే ఆముదం కూడా కను రెప్పలను ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.రాత్రి పడుకునే ముందు ఆముదంలో ఇయర్ బడ్ ముంచి కను రెప్పలపై అప్లై చేయాలి.ఉదయాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కళ్లను క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే ఖచ్చితంగా మీ కను రెప్పులు పెరగడం మీరు గమనిస్తారు.ఆముదం బదులుగా కొబ్బరి నూనెను కూడా అప్లై చేయవచ్చు.
కలబంద నుంచి గుజ్జు తీసుకుని కను రెప్పలపై అప్లై చేసుకోవాలి.పది లేదా ఇరవై నిమిషాల ఆరనిచ్చి అనంతరం గోరు వెచ్చని నీటితో కళ్లను వాష్ చేసుకోవాలి.
ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.కను రెప్పలు ఒత్తుగా, పెరవుగా పెరుగుతాయి.
ఇక వీటితో పాటు ఐమేకప్ వేసుకుంటేరాత్రి నిద్రించే ముందు తప్పకుండా రిమేవ్ చేసి పడుకోవాలి.