తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆమేనా కారణమా?

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కదలికలు వేగంగా మారుతున్నాయి.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీ లోపల క్రమశిక్షణా చర్యలు ప్రారంభమయ్యాయి.

 Congress Party Suspended Teenmar Mallanna.. Is That The Reason?, Teenmar Mallann-TeluguStop.com

తాజాగా, టీపీసీసీ(TPCC) క్రమశిక్షణా కమిటీ కీలక నిర్ణయం తీసుకుని, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను(Teenmar Mallanna.) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

తీన్మార్ మల్లన్న పార్టీ లైన్‌ను పలుమార్లు అతిక్రమించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యంగా, సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy)పదేపదే టార్గెట్ చేయడంతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఒక లైవ్ టీవీ షోలో కులగణన పత్రాలను చించివేయడం ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసింది.అంతేకాకుండా, మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్‌ తో విభేదాలు, ఇతర మంత్రులతో సహకరించకుండా వ్యవహరించడం కూడా ఆయనపై సస్పెన్షన్ విధించడానికి మరో కారణంగా మారింది.

పార్టీకి పెద్ద చిక్కుగా మారిన ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇతర నేతల నుంచి గత కొంతకాలంగా వినిపిస్తున్నది.

Telugu Congress, Disciplinary, Revanth Reddy, Telangana, Tpcc-Latest News - Telu

ఫిబ్రవరి 5న టీపీసీసీ(TPCC) క్రమశిక్షణా కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు(Show cause notice issued to Teenmar Mallanna) జారీ చేసింది.ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొంటున్నారో వివరణ కోరుతూ, ఫిబ్రవరి 12లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.అయితే, ఆయన స్పందించకపోగా.

షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాత కూడా తన వ్యతిరేక చర్యలు కొనసాగించారు.దీనిని దృష్టిలో ఉంచుకుని, పార్టీ క్రమశిక్షణా కమిటీ అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది.

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress), పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.ఇకపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఇతర నేతలపైనా ఇలాంటి చర్యలు తప్పవని అర్థమవుతోంది.

Telugu Congress, Disciplinary, Revanth Reddy, Telangana, Tpcc-Latest News - Telu

మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న ఈ నిర్ణయం, ఆమె దృఢమైన యాక్షన్ ప్లాన్‌ను ప్రతిబింబిస్తోంది.ఇంకా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఇతర నేతలపై కూడా క్రమశిక్షణా చర్యలు కొనసాగుతాయనే ప్రచారం జరుగుతోంది.తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna.)వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా ప్రతికూలంగా మారుతోందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ప్రతిపక్షాలకు ఆయుధంగా మారేలా ఆయన ప్రవర్తన ఉండటంతో, ఈ సస్పెన్షన్ ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చనే విశ్లేషణ ఉంది.మొత్తం మీద, కాంగ్రెస్ పార్టీ తన సొంత శ్రేణుల్లో క్రమశిక్షణను పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించిందని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube