1.మోదీ వస్తే పారిపోయావా ? : షర్మిల
తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తే పిరికొని లెక్క పారిపోయావా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
2.అంబేద్కర్ విగ్రహం వద్ద యోగా డే
జూన్ 21న ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద యోగ డే నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
3.రేవంత్ రెడ్డి కామెంట్స్
కాళేశ్వరం పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లు దోచుకున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నే చెప్పారని… అటువంటప్పుడు కెసిఆర్ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
4.16.54 కోట్ల తో సాగర్ కు మరమ్మత్తు పనులు
16.54 కోట్లతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరమ్మతులు నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 16.54 కోట్లతో మరమ్మతు పనుల కోసం నిధులు మంజూరు చేసింది .ఈ మేరకు టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
5.21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ లు
తెలంగాణలోని 21 జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ సముదాయాలు నిర్మించేందుకు ప్రభుత్వం భూ కేటాయింపు చేసింది.
6.బీజేపీ పై మంత్రి మల్లారెడ్డి విమర్శలు
బిజెపి అంటేనే జుటా పార్టీ అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.
7.కేసీఆర్ పర్యటన పై అనుమానాలు ఉన్నాయి జగ్గారెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ , ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పై అనుమానాలు ఉన్నాయని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
8.మహానాడుకు భారీ బందోబస్తు
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మాలిక్ గర్గ్ తెలిపారు.
9.ఆశా వర్కర్లకు హరీష్ రావు వార్నింగ్
ఆశా వర్కర్లకు పనిలో సిన్సియారిటీ ఉండాలని లేకుంటే ఏరిపారేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.
10.టిడిపి మహానాడు
ఏపీలో నేడు రేపు తెలుగుదేశం మహానాడు కార్యక్రమం ఒంగోలు సమీపంలోని వారి పాలెం వద్ద నిర్వహించనున్నారు.
11.మంత్రుల బస్సు యాత్ర
నేడు విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో వైసిపి మంత్రుల సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
12.కోనసీమలో మూడోరోజూ ఇంటర్నెట్ బంద్
కోనసీమలో వరుసగా మూడో రోజూ ఇంటర్నెట్ బంద్ చేశారు.దీంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
13.బాలకృష్ణ పర్యటన
సత్యసాయి జిల్లా లో నేడు హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు.
14.ఆత్మకూరు ఉపఎన్నిక
ఆత్మకూరు ఉప ఎన్నికలపై నెల్లూరులో నేడు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.
15.హరీష్ రావు పర్యటన
నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.
16.నిర్మల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష
నిర్మల్ లో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నారు.మున్సిపల్ ఉద్యోగాల భర్తీ లో అక్రమాలను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నారు.
17.ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.” స్టార్ ఆఫ్ గవర్నెన్స్ 2021″ అవార్డుకు ఎంపిక అయింది.
18.చింతమనేని ప్రభాకర్ కామెంట్స్
తనను అంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
19.అచ్చెన్నాయుడు కామెంట్స్
బస్సు యాత్ర లో వస్తోంది మంత్రులు కాదు ఆలీబాబా 40 దొంగలు అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,090
.