ఎవరి కష్టం వారిదే అంటూ బామ్మర్ది సినిమాపై ఎన్టీఆర్ కామెంట్.. తారక్ మాటలు నిజమేగా!

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ అనేది సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షో( Morning show ) వరకు మాత్రమే పనికొస్తుంది.ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటే మాత్రమే హీరోగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

 Junior Ntr Comments About Narne Nithin Movie Details Here Goes Viral In Social-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్( Narne Nithin ) మ్యాడ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.నార్నె నితిన్ కొత్త సినిమా ఆయ్ మూవీపై మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నార్నె నితిన్ కు జోడీగా నయన సారిక నటించారు.అంజి.కె.మణిపుత్ర( K.Maniputra ) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.ఈ సినిమాలో వర్షం సీన్ల కోసమే కోటి రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఆయ్ మూవీ కథ సెట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేస్తే ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తామని ఆ తర్వాత సినిమా బాగుంటే మాత్రమే ఆడుతుందని ఆయన అన్నారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

ఎవరి కష్టం వారిదేనని సినిమా కథ బాగుందని అంటున్నారు చేసేయండని ఎన్టీఆర్ ( NTR )చెప్పారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.నార్నె నితిన్ మాట్లాడుతూ మేము మంచి గోదావరి సినిమాను చేశామని సినిమాలో మంచి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పామని అందరూ ఎంజాయ్‌ చేసేలా సినిమా ఉంటుందని వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఎన్నో లెక్కలు ఉంటాయనే సంగతి తెలిసిందే.అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.నార్నె నితిన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.నార్నె నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.నార్నె నితిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube